అధికార పార్టీ పత్రిక కథనం.. అక్షర సత్యం అవుతుందా..?

01namaste

ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని నమస్తే తెలంగాణ పత్రికలో ఒక కదనం వచ్చింది.ఆ వార్తలోని కదనం ఇలా ఉంది. టీఆర్ఎస్ అధికార పత్రిక అయిన నమస్తే తెలంగాణలో ఈ కథనం రావడం సహజంగానే ప్రాధాన్యత ఉంటుంది. దాని వివరాలు ఇలా ఉన్నాయి.

‘ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన సంభాషణ చంద్రబాబుదే అని ముంబైకి చెందిన హెలిక్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో బయటపడింది. ఈ నివేదికతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిటిషన్ వేయడం, నివేదిక సమర్పించాలని ఏసీబీ డీజీని ఏసీబీ కోర్టు ఆదేశించడం తెలిసిందే. ఆ మేరకు చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నదని సమాచారం. గతేడాది దాఖలుచేసిన చార్జిషీట్‌లోనూ 33సార్లు చంద్రబాబు పేరును ఏసీబీ ప్రస్తావించింది. దీనితో ఏ విధంగా చూసినా చంద్రబాబును విచారించక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. విచారణలో చంద్రబాబు చెప్పే అంశాలను బట్టి.. నివేదిక తయారు చేసి, కోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల 29లోపు అందించాల్సి ఉంటుందని తెలిపారు. అలా చేయని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద తాము న్యాయస్థానం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని చెప్పారు.

ఎఫ్‌ఐఆర్ తప్పకపోవచ్చు: ఏపీ ఇంటెలిజెన్స్ అధికారి 
ఓటుకు నోటు కేసులో దర్యాప్తు తీరు, కోర్టు ఆదేశాలను బట్టిచూస్తే నూటికి నూరు శాతం చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు అవడం ఖాయమని ఏపీ ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న ఓ కీలక అధికారి నమస్తే తెలంగాణకు తెలిపారు. చట్టప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదుచేసిన తర్వాత విచారణకు నోటీసులిచ్చే అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుందని ఆయన తెలిపారు. చంద్రబాబు సీనియర్ సిటిజన్, పైగా ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఇంటికి వెళ్లి విచారించుకోవాల్సి ఉంటుందని అన్నారు. సీఆర్పీసీ ప్రకారం 60 ఏండ్లు దాటిన వారిని పోలీస్ స్టేషన్‌కు, దర్యాప్తు సంస్థవద్దకు పిలువడం కుదరదని చెప్పారు. అందువల్ల నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లి కేసు విషయంలో విచారణకు సహకరించేలా విజ్ఞప్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఆయన సహకరించకపోతే కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ జారీచేసే అధికారంకూడా ఉంటుందని ఏపీ ఇంటెలిజెన్స్ అధికారి స్పష్టంచేశారు.”అని ఈ వార్తలో పేర్కొన్నారు. ఆ మేరకు పరిణామాలు జరుగుతాయా?లేదా అన్నది వేచి చూడాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *