ఈమె డేంజర్..

ఒడిశాలోని భువనేశ్వర్ లో ఓ భార్య ఘాతుకానికి పాల్పడింది. భార్తను చంపి ఇంట్లో పాతిపెట్టింది. ధిరికుతి మురికివాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. కియాంజహర్ జిల్లా సులాన్ గ్రామానికి చెందిన అశోక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.. భార్య దీపతో తరుచూ గొడపపడుతున్నాడు. ఈ నేపథ్యంలో భార్య కోపంతో 15 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం అశోక్ అదృశ్యమయ్యాడు. అశోక్ స్నేహితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేశారు. అశోక్ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు తెలిపారు..

పోలీసులు ఇంటికెళ్లి చూడగా.. 5 అడుగుల గోతిలో అశోక్ మృతదేహం కనిపించింది. మెడకు తెల్లని గుడ్డ కనిపించింది. గొంతుకు ఉరిబిగించి చంపి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల విచారణలో భార్య హత్య చేసినట్టు రుజువైంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *