Breaking News

భార్య శవంతో 10కి.మీలు నడిచాడు..

odisha-man-759

కట్టుకున్న భార్య అర్ధంతరంగా ఆస్పత్రిలో కన్ను మూయడంతో సొంతూరికి తీసుకెల్లడానికి డబ్బులు లేక ఓ పేద గిరిజనుడు భుజం పై మోసుకొని 60కి.మీల దూరం నడక ప్రారంభించారు. ఈ హృదయ విదారక సంఘటన ఒడిశా రాష్ట్రంలోని భవానీ పట్నం జిల్లా లో జరగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయ వ్యాధితో మృతిచెందిన అమంగ్ దేవిని గిరిజనుడు దానా మాఝీ డబ్బులు లేక అంబులెన్స్ లో తీసుకెల్లలేక భుజంపై వేసుకొని రోడ్డు వెంట వెళ్లాడు. వెంట 12 ఏళ్ల కూతురు ఏడుస్తూ నడుస్తోంది. ఈ సంఘటన విలేకరులకు తెలియడంతో వారు జిల్లా కలెక్టర్ కు సంఘటనను వివరించారు. దీంతో ఆయన అంబులెన్స్ ఏర్పాటు చేయడంతో గిరిజనులు తమ స్వగ్రామానికి భార్య శవంతో చేరుకున్నాడు. అప్పటికే 10కి.మీలు భార్య శవంతో ప్రయాణించిన ఆ భర్త త్యాగం వెలకట్టలేనిది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *