
స్వయనా ఆమె ఐఏఎస్ ఆఫీసర్.. వరంగల్ అర్బన్ కు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరుపొందారు. కానీ కార్తీక మాసం సందర్భంగా వరంగల్ లోని వేయి స్తంభాల గుడిలో జరిగిన కార్తీక దీపారాదనలో ఆమె జీన్స్ ప్యాంటు, స్టివ్ లెస్ టాప్ వేసుకొని గుడిలో దీపారాదన చేయడంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి.
జిల్లాకు కలెక్టర్ గా ఉండి ఓ చారిత్రక గుడిలో జరిగిన కార్యక్రమానికి అలా హాజరుకావడంపై మీడియాలో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తిరుమల, వేములవాడ, యాదాద్రి సహా చాలా చోట్ల గుడులలోకి సంప్రదాయ వస్త్రాధారణతో రావాలనే కఠిన నిబంధనలుంటాయి. అది మహిళలైనా.. పురుషులైనా అదే వర్తిస్తుంది. కానీ జిల్లా అధికారిగా ఉన్న ఆమె ఈ నియమాలను పాటించలేదు.. వేయి స్తంబాల గుడిలో ఇలా దీపారదన చేసి విమర్శలు కొనితెచ్చుకుంది..