
మాజీ ఎంపీ వివేక్.. తన ఆర్థిక లావాదేవీలు, స్థలాలు కాపాడుకోవడానికే టీఆర్ఎస్ లో చేరారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇప్పుడు ఆరోపణలకు బలం చేకూరేలా ఒక విషయం బయటపడింది..
మాజీ ఎంపీ వివేక్ గత కాకా వెంకటస్వామి జయంతి రోజే కేసీఆర్ తో భేటి అయ్యారు. కాకాకు విగ్రహం. కొంత స్థలం కేటాయించి కేసీఆర్ అత్యంత ఘనంగా జయంతిని నిర్వహించారు. దీంతో అప్పటినుంచే కేసీఆర్ తో అనుబంధం పెంచుకొని ఆయనపై విమర్శలు చేయలేదు వివేక్..
కాగా టీఆర్ఎస్లో చేరడానికి మాత్రం బలమైన కారణం ఉందట.. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్, దేవినేని నెహ్రూ స్థలాల మధ్యలోని 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనది అని కొన్నానని గతంలో వివేక్ కోర్టుకెక్కాడు. దీనిపై వివాదం నడుస్తోంది.. ఈ 5 ఎకరాల అత్యంత విలువైన భూమిని క్రమబద్దీకరించేందుకే వివేక్ టీఆర్ఎస్ లో చేరినట్టు సమాచారం. దీంతో తన వ్యాపార సామ్రాజ్యానికి అధికార అండ ఉండాలని.. ఎంపీ గా వచ్చే ఎన్నికల్లో గెలవాలనే వివేక్ టీఆర్ఎస్ లో చేరినట్టు సమాచారం.