లారీ ఢికొని వీడియో జర్నలిస్ట్ సత్యం మృతి

* పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం

సికింద్రాబాద్ నుంచి టూ వీలర్ పై కీసర వెళ్తున్న HMTV జర్నలిస్టు సత్యంను మెట్టుగూడ దగ్గర వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వీడియో జర్నలిస్ట్ సత్యం అక్కడికక్కడే మృతి చెందాడు. సత్యం మృతదేహాన్ని అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో కెమెరామెన్ సత్యం మృతి జర్నలిస్ట్ లోకాన్ని కలిచివేసింది. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

14202687_1640818039542855_5764250314377346006_n

రంగారెడ్డి జిల్లా కీసరలో ఉంటున్న సత్యం హెచ్ఎంటీవీ ఆఫీస్ స్టూడియోలో కెమెరామెన్ గా విధులు నిర్వహిస్తుంటాడు. బుధవారం ఉదయం ఎప్పటిలాగే సత్యం డ్యూటీకి వచ్చాడు. మధ్యాహ్నం డ్యూటీ పూర్తయ్యాక.. బయట వ్యక్తిగత పనులు పూర్తి చేసుకొని.. రాత్రికి తిరిగి వెళ్తున్నాడు. సికింద్రాబాద్ నుంచి టూ వీలర్ పై కీసర వెళ్తున్న సత్యంను మెట్టుగూడ దగ్గర వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వీడియో జర్నలిస్ట్ సత్యం అక్కడికక్కడే మృతి చెందాడు.

సత్యం ఇక మన మధ్య లేడు.. అతని మృతదేహం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఉందని తెలిసి.. తోటి ఉద్యోగులంతా పొద్దున్నే గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. నిన్నటి వరకు కలిసి పనిచేసిన కెమెరా మెన్లు.. సత్యం ఇక లేడని తెలిసి షాక్ గురయ్యారు. ఈ సమాచారం తెలిసిన జర్నలిస్ట్ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. సత్యం మృతితో ఆ కుటుంబం ఇంటి పెద్దదిక్కును కోల్పోయింది. సత్యానికి భార్యతో పాటు.. పదేళ్లలోపు వయస్సున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. సత్యానికి హైదరాబాద్ మీడియా హౌస్ లిమిటెడ్ తో ఆరేళ్ల అనుబంధం ఉంది.

1979లో పుట్టిన సత్యం స్వస్థలం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడప. పోస్ట్ మార్టం అనంతరం బాడీని కీసర తీసుకెళ్లిన బంధువులు అనంతరం సొంత గ్రామానికి తీసుకెళ్లారు. ఆఫీస్ లో అంకిత భావంతో పనిచేసే సత్యం.. తోటి ఉద్యోగులతో కలివిడిగా ఉంటాడు. ఇలా ఒక్కసారిగా జరిగిన ఘటనను తోటి ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *