మరో ఫ్యామిలీ సినిమా వస్తోంది..

మనంతో అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించి ఆ ముచ్చట తీర్చుకుంది.. అదే బాటలో ఇప్పుడు మరికొందరు నటిస్తున్నారు. దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఇలాంటి సినిమానే ప్లాన్ చేస్తోంది. ప్రముఖ హీరో వెంకటేశ్, అతడి అన్న కొడుకు హీరో రానాలు బాబాయ్, అబ్బాయ్ లు వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటించేందుకు రంగం సిద్ధమైంది..

క్షణం సినిమాతో హిట్ కొట్టిన రవికాంత్ పేరేపి చెప్పిన కథ రానాకు నచ్చడంతో ఈ సినిమాలో వచ్చే ఏడాది నటించేందుకు ఓకే చెప్పాడట.. ఇందులో ఓ ప్రముఖ పాత్రకు వెంకటేశ్ నటించనున్నట్లు తెలిసింది. చాలాసార్లు బాబాయ్ వెంకటేశ్ తో కలిసి నటించాలనుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ సినిమాతో ఆ ముచ్చట తీరనుంది. తెలుగు ప్రేక్షకులకు మరో మనం సినిమా రాబోతున్నట్టే లెక్క..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *