Breaking News

వెంకటయ్యకు కేటీఆర్ 2 లక్షల నజరానా

ktr

జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుధ్య కార్మికుడిగా ఎంపికైన వెంకటయ్యను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు 2,11,111 రూపాయల నగదుతో పాటు దుశాల్వతో ఘనంగా సన్మానించారు. స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా జాతీయ స్థాయిలో ఇద్దరు కార్మికులను ఎంపిక చేయగా వీరిలో జీహెచ్ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ కు చెందిన పారిశుధ్య కార్మికుడు వెంకటయ్యకు అవార్డు లభించింది.

వెంకటయ్యకు లభించిన పురస్కారానికి స్పందించిన మంత్రి కె.టి.రామారావు వ్యక్తిగతంగా 1,11,111 రూపాయల చెక్కును బహుమానంగా అందజేశారు. దీంతోపాటు జీహెచ్ఎంసి నుండి మరో లక్ష రూపాయల చెక్కును వెంకటయ్యకు అందించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసి కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డిల సమక్షంలో సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి కె.టి.రామారావు వెంకటయ్యను ఘనంగా సన్మానించారు. వెంకటయ్య నగరానికి చేస్తున్న సేవలను మంత్రి అభినందించారు.

దేశం మొత్తంలో కేంద్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇద్దరు ఉత్తమ కార్మికులను గుర్తించగా వీరిలో గ్రేటర్ హైదరాబాద్ పారిశుధ్య కార్మికుడు టి.వెంకటయ్య ఉండడం అభినందనీయమన్నారు మంత్రి కేటీఆర్. వెంకటయ్యను తన కార్యాలయానికి పిలిపించుకుని అప్యాయంగా మాట్లాడారు. సెలవులు తీసుకోకుండా పనిచేస్తున్న తీరుపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంకటయ్య కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలో అవార్డు తీసుకునేందుకు వెళుతున్న వెంకటయ్యకు అన్ని ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.

తన పరిధిలోని రోడ్లను పరిశుభ్రంగా ఉంచకుంటే తనకు నిద్ర కూడా రాదని, అందుకే ప్రతిరోజు గత పదహారు సంవత్సరాలుగా ఒక్కరోజు సెలవు తీసుకుకోకుండా పనిచేస్తున్నట్లు మంత్రికి వెంకటయ్య తెలిపారు.

పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచిన వెంకటయ్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరు తమ తమ రంగాల్లో అకింత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యాన్ని చేరుకునేందుకు వెంకటయ్య లాంటి కార్మికుల పనితీరు, సేవాభావమే స్ఫూర్తి అన్నారు. స్వచ్ఛ నగర కల సాకారం కావాలంటే ప్రతి ఒక్కరు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. నగరంలో పనిచేసే ప్రతి ఒక్క సానిటేషన్ వర్కర్ కు వెంకటయ్య ఆదర్శమన్న మంత్రి, మరోవైపు నగరంలో ఇష్టారీతిన చెత్త వేసే ప్రతి ఒక్కరు వెంకటయ్యలాగా కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికుల కృషిని గుర్తించాలని కోరారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *