
మోడీ ఓ మర్రిచెట్టు.. దాని కింద ఏ మొక్క ఎదగనట్టే.. మోడీ కింద ఎదగాలనుకునే మొక్కలు ఎదగలేవు.. ఒక వేళ సొంతంగా లాబీయింగ్ తో ఎదగలానుకుంటే కూకటి వేళ్లతో సహా పెకిలించివేస్తాడు.. ఇప్పుడు అదే జరిగింది. కేంద్ర కేబినెట్ పునర్వ్యస్థీకరణ జరిగింది. కేంద్ర మంత్రివర్గం నుంచి వెంకయ్యను తప్పించారు. కీలక పార్లమెంటరీ వ్యవహారాల నుంచి ఆయనను తప్పించి సమాచార శాఖను కట్టబెట్టారు. పార్లమెంటరీ వ్యవహారాలను కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్ కుమార్ అప్పగించారు.
ఆది నుంచి మోడీని వెంకయ్య డామినేట్ చేస్తున్నారు. పార్లమెంటులో వన్ మ్యాన్ షో చేస్తూ మోడీ కంటే ఎక్కువగా మాట్లాడుతున్నారు. జీఎస్టీ సహా కీలక బిల్లుల్ని పాస్ చేయడంలో వెంకయ్య విఫలమయ్యాడు. సోనియాను , ప్రతిపక్షాలను సరిగ్గా డీల్ చేయడం లేదు. పార్లమెంటులో మోడీ కంటే ఎక్కువ ఫోకస్ కావడంతో మోడీ తన మార్క్ చూపించాడు. వెంకయ్యను పార్లమెంటరీ వ్యవహారాల నుంచి తప్పించి సమాచారశాఖను అప్పగించారు. దీంతో తనకు పోటీగా, డామినేట్ చేస్తే ఎమవుతుందో కేంద్ర మంత్రివర్గ సహచరులకు గట్టి హెచ్చరిక చేశారు. సీనియర్ అయిన వెంకయ్యనే ఇలా చేయడంతో కేంద్ర మంత్రివర్గంలో ఇప్పుడు సర్వాత్రా చర్చ జరుగుతోంది..