సాహిత్యం ప్రపంచస్థాయి కి చేరడానికి అనువాదాలే సాధనం

whatsapp-image-2016-09-18-at-17-26-46

-వారాల ఆనంద్ కవిత్వ అనువాదం ‘సిగ్నేచర్ ఆఫ్ లవ్ ‘ఆవిష్కరణ సభ లో వక్తలు

తెలంగాణ సాహిత్యానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడానికి అనువాదమే ప్రధానమైన వారధి అని తెలంగాణ శాసన మండలి సభ్యుడు నారదాసు లక్ష్మణ్ రావు అన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆవరణలోని నేషనల్ బుక్ ట్రస్ట్ ఆవరణ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ‘సిగ్నేచర్ ఆఫ్ లవ్ ఆంగ్ల’ కవితా సంకలాన్ని ఆవిష్కరించారు.

ప్రముఖ కవి వారాల ఆనంద్ రాసిన తెలుగు కవిత్వాన్ని అను బొడ్ల ఆంగ్లంలోకి అనువదించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ కవి నందిని సిద్దారెడ్డి మాట్లాడుతూ వారాల ఆనంద్ కవిత్వంలో  ఆర్తి ఆర్థ్డత సామాజిక కోణం ఉన్నాయన్నారు. ఆ కవిత్వాన్ని దేశవ్యాప్తంగానూ ప్రపంచవ్యాప్తంగానూ చేరవేయడానికి అనుబొడ్ల అనువాదం సిగ్నేచర్ ఆఫ్ లవ్ ఉపయోగ పడుతుందన్నారు. అనువాదం అంత సులభమయింది కాదని తెలంగాణ కవులందరూ అనువాదాల పాయిన దృష్టి పెట్టాల్సిన అవసరం వుందన్నారు. తెలంగాణ కవిత్వంలో గొప్పదనం ప్రపంచానికి తెలియాల్సి వుందన్నారు. సిగ్నేచర్ ఆఫ్ లవ్ పుస్తకాన్ని సమీక్షించిన కవి దర్భశయనం శ్రీనివాసాచార్య మాట్లాడుతూ అనువాద ప్రక్రియ గొప్ప దాని అయితే అంత సులువయింది కాదన్నారు. భాషను అనువాదం చేయడమే కాకుండా మూల భాషలో వున్న కవి అంతరంగాన్ని అందుకున్నప్పుడే అనువాదం గొప్పగా వుంటుందన్నారు. సిగ్నేచర్ ఆఫ్ లవ్ పుస్తకం గొప్ప అనువాదమని చెప్పారు.

కవి వారాల ఆనంద్ తాన కవిత్వ మూలాల్ని వివరించారు. అనువాదకురాలు అను బొడ్ల మాట్లాడుతూ తాను అనువాదం లో ఎదుర్కొన్న అనుభవాల్ని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సముద్రాల వెంకటేశ్వర్, కన్నెగంటి అనసూయ, వొడ్నాల చంద్రమౌళి, కోడం పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *