ధర్నా, వంటావార్పుతో జర్నలిస్టుల నిరసన

తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై ఈరోజు ఆందోళనలు పెచ్చరిల్లాయి. అన్ని కలెక్టరేట్లతో పాటు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఈరోజు వంటా వార్పు, ధర్నాను జర్నలిస్టులు నిర్వహించారు. వేలాదిగా జర్నలిస్టులు హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా  ధర్నాలో జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు కదంతొక్కారు.. ఈ ధర్నాలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తాడూరి కరుణాకర్, గాండ్ల శ్రీనివాస్, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేశ్ , భారీగా జర్నలిస్టులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం ధర్నాలో పాల్గొని జర్నలిస్టుల పార్టీ తరఫున సంఘీభావం తెలిపారు.

IMG_20160822_115852

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *