
తెలంగాణ మరో అరుదైన ఘనతను సాధించింది. జాతీయ సగటును మించి ఉపాధి హామీలో తెలంగాణ పురోగతి సాధించింది. ఉపాధి హామీ పథకంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును అధిగమించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపాధి హామీ పథకం అమలులో గణాంకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకు 49 రోజులు పనిదినాలు కల్పించారు. కానీ తెలంగాణలో సగటును 55 రోజుల పనిదినాలు కల్పించారు. జాతీయ స్థాయిలో కేటాయించిన బడ్జెట్ లో 74శాతం నిధులు ఖర్చయితే తెలంగాణలో 104శాతం ఖర్చు చేసి ఉపాధి కల్పించడం ద్వారా తెలంగాణ దేశంలోకెల్ల ఉపాధిహామీలో మొదటిస్థానంలో నిలిచింది.