ఆడపిల్లల్ని ఆకలితో చంపేద్దామనుకున్నారు..

ఉత్తర ఢిల్లీలో దారుణం వెలుగుచూసింది. ఆడపిల్లలు ఇద్దరిని వదిలించుకోవాలని ప్రయత్నించిన కఠిన తల్లిదండ్రుల దురాగతం అందరిని కలిచివేసింది.. 8 ఏళ్ల హిమాన్షు, 3 ఏళ్ల దీపాలిలు ఆడపిల్లలనే సాకుతో ఇంట్లో తాళం వేసి తల్లిదండ్రులు వెళ్లిపోయారు. వీరు ఆకలితో చచ్చిపోవాలని వారు వేసిన ప్లాన్ నెరవేరలేదు. వీరి అరుపులు విన్న చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఈ ఇద్దరు అక్కచెల్లెల్లను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పూర్తిగా నీరసించి పోయిన ఆ పిల్లలను చూసి ఇరుగుపోరుగు వారు కంటతడి పెట్టారు. ఆ పాపాత్ములైన తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మానవత్వం మంటగలుస్తున్న ఇలాంటి ఘటనలు మాయని మచ్చగా మిగిలిపోతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *