Tuwj(IJU)లో చేరిన మంథని జర్నలిస్టులు

కరీంనగర్ : మంథని నియోజకవర్గానికి చెందిన పలువురు జర్నలిస్టులు… ఐజేయూ అనుబంధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (Tuwj) రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ , కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాడూరి కరుణాకర్ ల ఆధ్వర్యంలో Tuwjలో బుధవారం చేరారు. అల్లం నారాయణ సారథ్యం వహించిన టీయూడబ్ల్యూజే లోంచి వీరంతా ఐజేయూ అనుబంధ Tuwjలో చేరారు.

కొత్తగా అల్లం నారాయణ నేతృత్వంలోని సంఘంలో చేరినప్పటినుంచి ఇంతవరకు ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదని.. కనీసం జర్నలిస్టులను పట్టించుకోలేదని అందుకే ఐజేయూ అనుబంధ టీయూడబ్ల్యూజేలో చేరుతున్నామని మంథని జర్నలిస్టులు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై పోరాడని సంఘం నుంచి బయటకు వచ్చి, అహర్నిషలు పాటుపడుతున్న ఈ సంఘం లో చేరడం ఆనందంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ మాట్లాడుతూ  స్వార్థ చింతనతో పదువుల కోసం కొందరు ఆశపడి సంఘం పెట్టారని..  అందులో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకనే తమ సంఘంలో చేరుతున్నారని అన్నారు.

టీయూడబ్ల్యూజేలో చేరిన వారిలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొమురోజు చంద్రమౌళి, జిల్లా కార్యవర్గ సభ్యులు తగరం రాజు, నమస్తే తెలంగాణ రిపోర్టర్ అంకరి ప్రకాష్,  టీఈఎంజేయూ ఉపాధ్యక్షుడు మేడగోని రాజమౌళి గౌడ్, సమ్మయ్య, చంద్రమోహన్ తో పాటు 18 మంది ఉన్నారు.

కార్యక్రమంలో సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాడూరి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, నాయకులు, జర్నలిస్టులు అయిలు రమేశ్, ఎలగందుల రవీందర్, బి. విజయసింహారావు, రమణాచారి, కె. నాగులు, పి.శ్రావణ్ కుమార్, మహమూద్ ఖాన్, ఎన్. రాజాబాబు, అంకేరి ప్రకాశ్, ఆర్ల బాపు, పోతరాజు సమ్మయ్య, రావికంటి  దిలీప్ కుమార్, చంద్రమోహన్, రాజు, వేణు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *