జర్నలిస్టుల సమస్యలపై ఇక పోరుబాటే..

తెలంగాణలో రెండేళ్లు పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో పెడుతున్న జర్నలిస్టులపై సమస్యలపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టీయూడబ్ల్యూజే) పోరుబాటకు శ్రీకారం చుట్టింది. అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, జర్నలిస్టుల పిల్లలకు చదువుల్లో రాయితీ, ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల సంక్షేమ నిధి తదితర సమస్యలను పరిష్కరించేందుకు సంఘం నాయకులు ఆందోళనలు చేయాలని నిర్ణయించారు.

నిజామాబాద్ లో ఇవాళ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన వహించారు. ఈ సదర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ నాయకులు హాజరై జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల ప్రదర్శిస్తున్న ఉదాసీన వైఖరిని నాయకులు తప్పుపట్టారు. వెంటనే హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. అధికారుల పేరు చెప్పి నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ జర్నలిస్టుల సమస్యలను గాలికొదిలేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని లేకపోతే హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఐజేయూ సీనియర్ నాయకులు కే.శ్రీనివాసరెడ్డి, ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కే.అమర్ నాథ్, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి విరాహత్ అలీ, జాతీయ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, ఎంఏ మాజిద్, ఆలపాటి సురేష్ కుమార్, యూనియన్ రాష్ట్ర నాయకులు అయిలు రమేశ్, తాడూరి కరుణాకర్, కే.రామనారాయణ, దొంతు రమేశ్, ఏ.రాజేశ్, సంపత్ కుమార్, ప్రకాశ్ రెడ్డి, ఫైజల్ , పిట్టల రాజేందర్, బల్మూరి విజయసింహారావు, కే.ప్రభాకర్ రెడ్డి, అంగిరేకుల సాయిలు, గడ్డం రాజిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, వెంకటరమణ ప్రసేన్, వెంకటేశ్వరరావు, గాండ్ల శ్రీనివాస్, ప్రభుదాస్, జగన్ మోహన్, లింబాద్రి, కిషన్, శ్రీనివాస్, కొటగిరి దైవాదీనం,తదితరులు పాల్గొన్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *