Breaking News

ఆడుతు పాడుతూ వంట చేస్తూంటే..

ailu44

తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన జర్నలిస్టులకు రాజకీయ నాయకుల నుంచి అనూహ్య మద్దతు లభించింది. కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ ప్రజాప్రతినిధులందరూ హాజరై జర్నలిస్టుల ధర్నా, వంటావార్పులో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ప్రభుత్వం, కేసీఆర్ లు జర్నలిస్టులపై వ్యవహరిస్తున్న వివక్షను, దమననీతిని ఎండగట్టారు. కరీంనగర్ డీసీసీ అద్యక్షులు కటకం మృత్యుంజయం జర్నలిస్టులతో మమేక మయ్యారు. వంటావార్పులో భాగంగా వంట చేస్తున్న జర్నలిస్టులతో కలిసి గరిటె తిప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు న్యాయం జరగడం లేదని తెలిపారు.

కాగా ఈ ధర్నాలో ప్రజాప్రతినిధులు చాడ వెంకట్ రెడ్డి, కటకం మృత్యుంజయం, పొన్నం ప్రభాకర్, విజయరమణరావు, బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బీజేపీ జాతీయ నాయకుడు సుగుణాకర్ రావు, గందె మాధవి, సుజాతరెడ్డి, ఆకుల ప్రకాష్, సుదర్శన్, కొరివి వేణుగోపాల్, పీవీ సూర్యం, పాల్గొని ప్రసంగిస్తూ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, కరీంనగర్ జిల్లా అద్యక్షులు తాడూరి కరుణాకార్, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ టోమ్జా రాష్ట్ర అద్యక్షులు అయిలు రమేశ్ , జిల్లా కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసింహారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిట్లల రాజేందర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, సురేంద్రకుమార్, లాయక్ పాషా, కే. భద్రాచలం, ప్రభుదాసు, విజయేందర్ రెడ్డి, వంశీ, జగన్మోహన్, కొండా లక్ష్మన్, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, వందలాది మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *