Tuwj మహాసభలను విజయవంతం చేయండి

కరీంనగర్ :  ప్రత్యేక రాష్ట్రం అవతరించిన తర్వాత ఐజేయూ అనుబంధ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (tuwj) ఈ నెల 19న హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో  తొలి రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తోందని .. వీటిని విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అన్నారు.  కరీంనగర్ లోని ప్రెస్ భవన్ లో బుధవారం మహాసభ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది  సభ్యులు ఈ మహాసభకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని.. అందరూ వచ్చి సంఘటిత శక్తిని చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాడూరికరుణాకర్, ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, నాయకులు, జర్నలిస్టులు అయిలు రమేశ్, ఎలగందుల రవీందర్, బి. విజయసింహారావు, రమణాచారి, కె. నాగులు, పి.శ్రావణ్ కుమార్, మహమూద్ ఖాన్, ఎన్. రాజాబాబు, అంకేరి ప్రకాశ్, ఆర్ల బాపు, పోతరాజు సమ్మయ్య, రావికంటి  దిలీప్ కుమార్, చంద్రమోహన్, రాజు, వేణు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *