HUJ-సాధన్ కాలేజీ ఆధ్వర్యంలో హెల్త్ కార్డులు పంపిణీ

helth cards

ఐజేయూ అనుబంధ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( టీయూడబ్ల్యూజే ), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(హెయూజే), సంయుక్తంగా ఉచిత ఆరోగ్య చికిత్స కార్డులను సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టు సభ్యులకు పంపిణీ చేశారు. ఐజేయూ సెక్రటరీ జనరల్  అమర్ ముఖ్యఅతిథిగా హాజరై హెల్త్ కార్డులను అందజేశారు. జర్నలిస్టులకు ఉచితంగా హెల్త్ కార్డులను అందజేసేందుకు ముందుకు వచ్చిన సాధాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధినేత రసూల్ ఖాన్ ను ఈ సందర్భంగా జర్నలిస్టులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజేయూ నాయకులు దేవులపల్లి అమర్ , కే అమర్ నాథ్, ఆరేపల్లి సురేష్ కుమార్, కే.సత్యనారాయణ, దాసరి కృష్ణారెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు  వై.నరేందర్ రెడ్డి, అయిలు రమేశ్,  సంపత్ కూమార్, వెంకటరెడ్డి, ఏ. రాజేశ్, హెచ్ యూ జే అధ్యక్షులు కోటిరెడ్డి , కార్యదర్శి వెలిచాల చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్ గౌడ్,(టీయూడబ్ల్యూజే ,కరీంనగర్ జిల్లా కార్యదర్శి) గాండ్ల శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *