
మన దేశంలో ఏడు తులసి రకాలే ఉండటం గమనించదగ్గ విషయం. 1. కృష్ణ తులసి, 2. లక్ష్మి తులసి, 3. విష్ణు తులసి, 4. అడవి తులసి, 5. రుద్ర తులసి, 6. మరువక తులసి, 7. నీల తులసి.
తులసి మొక్కలో ‘తెైమాల్’ ఔషధ పదార్థం ఉంటుంది. మన కంటికి కనిపించని అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియాను పరిసరాలకు రానివ్వకుండా తెైమాల్ అడ్డుపడుతుంది.
తులసి మొక్కలున్న ప్రదేశంలో పిడుగులు పడవని ప్రతీతి.
తులసి ఆకుల రసం సేవించటం వల్ల ఒత్తిడిని తగ్గించవచ్చని రుజువెైంది.
500 మి.గ్రా. నీటిలో 5 గ్రాముల తులసి ఆకు లను వేసి, మరిగించి కొద్దిగా పాలు, పంచదార కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది. గొంతునొప్పి, గొంతు బొంగురుపోవటం లాంటి వాటిని తగ్గిస్తుంది. తులసి ఆకులను నీటిలో మరిగించి తాగితే మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరాలను దరిచేరనీయదు.
తులసి కషాయంలో తేనె, అల్లం రసం సమ పాళ్లలో కలిపి సేవిస్తే ఇన్ ఫ్లూయంజా, ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
తులసి ఆకుల రసంలో హారతి కర్పూరం కలిపి శరీరం పెై రాస్తే గజ్జి, తామర లాంటి దీర్ఘకాలపు చర్మపు వ్యాధులు సమసిపోతాయి. తులసి ఆకుల రసం ముక్కులోకి వేస్తే ముక్కు దిబ్బడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
తులసి ఆకుల రసం శ్వాస నాళాలలోని కఫాన్ని తొలగిస్తుంది.
తేలు, జర్రి లాంటి విష కీటకాలు కుట్టిన చోట తులసి పసరు పూస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.
తులసి, పచ్చ కర్పూరం, తమలపాకులు కలగ లిపి నిత్యం సేవిస్తే ఉబ్బసం వ్యాధి కొన్నాళ్ళకు తగ్గిపోతుంది.
పడిశం పట్టినపుడు వేడి నీళ్ళలో తులసి ఆకులు వేసి ఆవిరిపడితే జలుబు తగ్గిపోతుంది.
ప్రతిరోజూ ఉదయం రెండు తులసి ఆకులను నమిలి, ఆ రసం మింగితే కడుపులో పేరుకుపోయిన జబ్బులను దూరం చేస్తుంది.
హిందూ దేవాలయాలలో తీర్థం తయారు చేసే సమయంలోనే తులసి ఆకులు వేస్తారు. తులసి ఆకులను ప్రత్యేకంగా సేవించకపోయినా, దేవుని తీర్థం సేవించినపుడెైనా కడుపులోని రుగ్మతలు రూపుమాప వచ్చనే సదుద్ధేశ్యంతో తీర్థంలో తులసి ఆకులు కలపాలనే ఆలోచన అనాదిగా, ఆనవాయితీగా వస్తుంది.
తీర్థం పంచుతూ ఆలయ పూజారి ‘అకాల మృత్యు హరణ… సర్వ వ్యాధి నివారణం… సమస్త పాపక్షయకరం… భతవత్ పదోదకం.. శుభం’ అంటూ తులసి మనకు ఎన్ని విధాల ఉపయోగ పడుతుందో వివరిస్తాడు.
తులసి చుట్టు ప్రదిక్షణ చేస్తున్నప్పుడు ఉత్తేజకర మైన ‘పాజిటివ్ వెైబ్రేషన్లు’ కలుగుతాయని పరిశోధనలు నిరూపించాయి.
తులసి పరిమళం నాసికా రంద్రాలకు సోకితే సైనస్ వంటి వ్యాధులున్న వారికి శ్వాస క్రియ సవ్యమవుతుంది.
శ్వేత, కుష్ఠు మరియు బాల్లి లాంటివి పొడచూపి, శరీరం తెల్లగా మారి, వికృతంగా కనిపిస్తున్న వారికి ‘కృష్ణ తులసి’ ఎంతో మేలుచేస్తుంది.
కృష్ణ తులసితో తయారు చేయబడిన మందులు ఊపిరితిత్తుల వ్యాధులను, గుండె జబ్బులను, విషదోహాలను, ధనుర్వాతాలను, ప్లేగు, మలేరి యాలను నిర్మూలించటానికి ఉపయోగిస్తు న్నారు.
నేల తులసికి తలవెంట్రుకలకు బలాన్నిచ్చే శక్తి ఉంది. తల నూనెల తయారీకి నేల తులసిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కర్పూరం తయారీకి కూడా దీనిని వాడటం గమనార్హం.
రామ తులసి ఆకులు అజీర్తిని పారద్రోలి, జీర్ణ శక్తిని పెంచుతాయి. భోజనం అనంతరం రామ తులసి లేత ఆకులను నమిలితే దంతాలు గట్టి పడటంతో పాటు, దంత సంబంధిత రుగ్మతలు అదుపవుతాయి.