TSRTC తొలి ఎండీ రమణరావు

jv ramana

ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విడిపోయి రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు వేర్వేరు ఆర్టీసీలు ఉద్భవించాయి. ఈ సందర్భంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ తొలి ఎండీగా జేవీ రమణరావు నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

అనంతరం జేవీ రమణరావు సీఎం కేసీఆర్ ను క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఆర్టీసీ ని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావాలని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *