టీఆర్ఎస్ గురించి కొత్త విషయం చెప్పిన విజయశాంతి

టీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగి ఆ తరువాత కాంగ్రెస్ లో చేరిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి కొత్త విషయం బయటపెట్టారు. ఇటీవల విజయశాంతిపై టీఆర్ఎస్ నాయకుల విమర్శలకు గట్టిగా బదులిచ్చారు..
ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ ’ టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేశాకా తాను కాంగ్రెస్ లో చేరానని .. కానీ కాంగ్రెస్ లో చేరిన తర్వాత టీఆర్ఎస్ సస్పెండ్ చేసిందని వాళ్లు అబద్దాలాడుతున్నారని ఆమె మండిపడింది.. టీఆర్ఎస్ పార్టీ నన్ను 2013 జూన్ లో సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఎనిమిది నెలలకు తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందాక మాత్రమే నేను కాంగ్రెస్ లో చేరా’ అని విజయశాంతి చెప్పారు..

కుట్రలు, కుతంత్రాలుతో టీఆర్ఎస్ పార్టీలో ఎదుగుదలను ఓర్వలేకనే పంపించేశారని.. ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉన్నందుకు తనకు ఈ శిక్ష వేసారని విజయశాంతి వాపోయారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *