కరీంనగర్ లో టోర్నడో వచ్చింది.. పారిపోండి

కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ లో శుక్రవారం సాయంత్రం టోర్నడో వచ్చింది. భారీ సుడిగాలులు చెలరేగాయి. దాదాపు అరగంట పాటు డ్యాంలోని నీరు ఒక్కసారి పైకి లేచినట్లుగా ఈ సుడిగాలులు చెలరేగాయి. ఈ దృశ్యం సముద్రాల్లో కనిపించే టోర్నాడో తరహాలో కనిపించడం విశేషం. ఈ దృశ్యాల్ని చూసిన డ్యాం లో చేపలు పడుతున్న మత్స్యకారులు బయటకు వచ్చారు. ఆకాశంలో పైకి ఎగజిమ్మిన నీరు వర్షం రూపంలో కరీంనగర్ టౌన్ లో కొద్దిసేపు కురిసింది. ఈ దృశ్యాలను కొంతమంది సెల్ ఫోన్లలో చిత్రీకరించి వాట్సప్ , ఫేస్ బుక్ లో షేర్ చేయడంతో… ఇప్పుడిదో హాట్‌టాపిక్‌గా మారింది.

అతిపెద్ద సుడిగాలి (టోర్నడో) వీడియోను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *