Breaking News

ఆన్ లైన్ మీడియా జర్నలిస్టులకు సైతం అక్రిడిటేషన్లు: హరీష్ రావు

6

తెలంగాణ ఆన్ లైన్ మీడియా లో పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. శనివారం తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ సందర్భంగా టోమ్జా రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేశ్ జర్నలిస్టుల సమస్యలను మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. ఆన్ లైన్ మీడియాలో కేవలం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు మాత్రమే అక్రిడిటేషన్లు ఇస్తున్నారని.. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని.. అయిలు రమేశ్ మంత్రి హరీష్ రావును కోరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆన్ లైన్ మీడియా అప్ కమింగ్ మీడియా అని.. దీన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుందని.. ప్రతిరోజు రెగ్యులర్ గా న్యూస్ కవర్ చేసే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇచ్చే విషయం పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

harish
ఈ కార్యక్రమంలో దుబ్బాక శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు కే. సత్యనారాయణ, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.శ్రీకాంత్ రెడ్డి, సూర్యారావు, రాష్ట్ర కార్యదర్శి ఏ . రాజేశ్, కోశాధికారి కనుకదుర్గ, సభ్యులు ఎస్. నాగరాజకుమారి, రేఖారాణి, శశిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *