కనిపించే దేవుడికి సేవ చేయండి..

_ కాగితాన్ని కనిపెట్టిందెవరు?
మనిషి.
నిప్పును కనిపెట్టిందెవరు?
మనిషి.
చక్రాన్ని కనిపెట్టిందెవరు?
మనిషి
వ్యవసాయాన్ని కనిపెట్టిందెవరు?
మనిషి
పెద్ద పెద్ద ఇల్లు,బంగళాలు కట్టిందెవరు?
మనిషి
ఓడను కనిపెట్టిందెవరు?
మనిషి
విమానం కనిపెట్టిందెవరు?
మనిషి
కంప్యూటర్ కనిపెట్టిందెవరు?
మనిషి
ఫోన్, మొబైల్ కనిపెట్టిందెవరు?
మనిషి
కార్లు, వాహనాలు కనిపెట్టిందెవరు?
మనిషి
ఇంట్లో విశ్రాంతి,సుఖము, ప్రశాంతత కొరకు ఏ వస్తువులనయితే ఉపయోగిస్తున్నావో వీటిని ఎవరు తయారు చేశారు?
మనిషి
ఏ face book,whatsap లలో postings చదువుతున్నావో వీటిని ఎవరు సృష్టించారు?
మళ్ళీ సమాధానం మనిషి
ఈ సమాజాన్ని నిర్మించిందెవరు
మనిషి ?
మతాలను,ధర్మాలను సృష్టించిందెవరు
మనిషి
మందిరము,మసీదు,చర్చి సృష్టించిందెవరు?
మనిషి
వీటిలో దేవున్ని ప్రతిష్టించిందెవరు ?
మనిషి
విచిత్రమైన విషయమేమిటంటే ప్రతి ఒక్కటీ మనిషే సృష్టించాడు
అయినప్పటికీ మనం దేవుడు చమత్కారాలు చేస్తాడని విశ్వసిస్తాం.
మనిషే దేవున్ని సృష్టంచాడనడానికి సాక్ష్యాలు
1)మనిషి తప్ప ఏ ప్రాణీ భగవంతున్ని కోరికలు కోరదు.
2)మనిషి నివాసం లేని చోట మందిరం గాని, మసీదు గాని,చర్చి గానీ లేవు.
ఇతర గ్రహాలలో గానీ, మంచు ఖండంలో గానీ.
3)వేరు వేరు దేశాలలో ప్రాంతాలలో వేరు వేరు దేవతలు, దీని అర్థం మనిషి
ఊహలతో తన ఇష్టమైన రీతిలో భగవంతున్ని సృష్టించాడు.
4)ప్రపంచంలో అనేక ధర్మాలు అనేక సాంప్రదాయాలు, అనేక పద్ధతులు
ఒకర్నొకరు విమర్శించుకోవడాలు
దీని అర్థం దేవుడు ఒకరు కాదనేగా.
అందరూ చెబుతారు దేవుడొక్కడే అని.
కానీ కొసమెరుపు అది మా దేవుడే.
5)రోజుకో క్రొత్త దేవుడు, రోజుకో కొత్త పద్ధతి. మాదే గొప్ప అనే వితండ వాదనలు.
6)ప్రశ్నించే వాన్ని నాస్తికుడనో, హృదయం లేని వాడనో ముద్ర వేయడం.
7)ఈ ప్రపంచంలో వేరు వేరు దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఎన్ని తిప్పలో ఎన్ని ప్రయాసలో వర్ణించ నలవి కాదు.
8)ఇప్పటి వరకు నాకు దేవుడు కనపడినాడని చెప్పిన మనిషే లేడు.
బుద్దుడు, వివేకానందుల వారు కూడా కనపడే మనిషికే సేవచెయ్యమన్నారు
ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చివరకు కీర్తి కాంక్ష కూడా సుమా!
9)దేవుడున్నాడు లేడు అనే వాడు కూడా ఒకే విధమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు.
10)భగవంతుడు ఎవరికీ మేలు చెయ్యట్లేదు అలా అని కీడు కూడా చెయ్యట్లేదు
11)దేవుడు లంచగొండితనం,అన్యాయం,దొంగతనం,బలాత్కారము,ఆతంకవాదము,అరాచకత్వాన్ని నిరోధించడం లేదు.
12)అమాయకమైన చిన్న పిల్లలను కాల్చుతున్నా కూడా వారిని ఆపడం లేదు.
13.మందిరాలు,మసీదులు,చర్చిలు,ధ్యానమందిరాలు ఇవి దేవుని నిలయాలనే చెప్పుకునే చోట కూడా
మహిళలు,పిల్లలు సురక్షితంగా లేరు.
14.మందిరాలు, మసీదులు,చర్చిలు కూల్చుతుంటే ఏ దేవుడూ వచ్చి ఆపలేదు.
15.అభ్యాసం చేయకుండా ఏ ఒక్క విద్యార్థి అయినా ఉత్తీర్ణుడయ్యాడా?
16)25 సంవత్సరాలముందు లేని దేవుండ్లు, రకరకాల పద్ధతులు ఈ నాడు గొప్ప గొప్పవి అయిపోయినాయి.
17)తానే దేవున్నని చెప్పుకునే వాల్లు చాలా మంది జైల్లలో ఊచలు లెక్క పెడుతున్నారు.
18)ఈ ప్రపంచంలో దేవుడే లేడని చెప్పేవాల్లు చాలా మంది ఆనందంగా ఉన్నారు.
19) హిందువులు అల్లాను స్వీకరించరు,ముస్లిములు హిందూ దేవతలను,క్రైస్తవులు హిందూ దేవతలను,అల్లాహ్ ను ఒప్పుకోరు.
హిందూ ముస్లిమ్ గాడ్ ను అంగీకరించరు. అయినప్పటికీ ఈ దేవతలంతా ఎందుకిలా అని ఎవర్నీ అడుగలేదే?
కనుక ఆనందమే దైవం ఆనందం ఎప్పుడు కలుగుతుందీ అంటే కనపడని దేవుని పేరుతో కోటాను కోట్ల వ్యాపారం చేయడం కన్నా కనపడే మనిషికి సేవచేయడంలో. వారి కళ్ళలో కనపడే కృతజ్ఞతాపూర్వకమైన చూపును అనుభవించే వారికే తెలుస్తుంది. ప్రపంచంలోని తియ్యదనమంతా ఇందులోనే ఉంటుంది. మహామహులను పూజించడం కంటే వారు చూపిన మార్గంలో వెళ్ళడమే సరియైన విధానం.

రచయిత
మీ.మనిషి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *