Breaking News

TNGO’s యూనియన్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డైరీ , కాలెండర్ – 2018 ను ఆవిష్కరించిన మంత్రి పద్మారావు గౌడ్

Photo

మంత్రి పద్మారావు గౌడ్  సెక్రటేరియట్ లోని “D” బ్లాక్
లోని కాన్ఫరెన్స్ హాల్ లో TNGO’s యూనియన్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డైరీ ,
కాలెండర్ – 2018 ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ……. ఈ డైరీ , కాలెండర్ ను నా
చేతులమీదుగా ఆవిష్కరించడం చాలా ఆనందంగా వుందన్నారు.     తెలంగాణ
ఆవిర్భవించిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గుడుంబా పై ఉక్కుపాదం
మోపి, గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చడం లో కింది స్థాయి సిబ్బంది నుండి ఉన్నతాదికారుల వరకు కృషి
వుందన్నారు. అదే విదంగా గుడుంబా నుండి బాధితులను కాపాడుకోవడం జరిగిందన్నారు… ఎక్సైజ్
ఉద్యోగులకు సంబందించిన సమస్యల పరిష్కారానికి సంక్రాంతి తరువాత ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు
చేస్తానన్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ సోమేష్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాదికారులు మరియు ఉద్యోగ సంఘాల
నాయకులు కూడా ఈ సమావేశం లో పాల్గొంటారు. తన పరిధి లోని సమస్యలను ఎప్పటికప్పుడు
పరిష్కరిస్తానని, క్లిష్టమైన మరికొన్ని సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. సొంత
భవనాలు మరియు సొంత రవాణా సౌకర్యాల కల్పనపై ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి ద్రుష్టి కి
తీసుకెళ్లమన్నారు. ఎక్సైజ్ శాఖ విభాగానికి చెందిన ప్రతి పైసా నేరుగా ట్రెసరీ కె వెళ్తుందన్నారు. ఎక్సైజ్ ఆదాయం
ద్వారా రాష్ట్రం లో అనేక సంక్షేమ పథకాల నిర్వహణకు ఉపయోగపడుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమం లో టి‌ఎస్‌బి‌సి‌ఎల్ ఛైర్మన్ దేవి ప్రసాద్ రావు, ప్రిన్సిపాల్
సెక్రెటరీ సోమేష్ కుమార్, మంత్రి ఓ‌ఎస్‌డి రాజేశ్వర్ రావు, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్
వివేకానంద రెడ్డి, రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ ఖురేషీ, టి‌ఎన్‌జి‌ఓ సెంట్రల్ ప్రెసిడెంట్ కారం రవీందర్ రెడ్డి, ప్రధాన
కార్యదర్శి రాజేందర్, అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి, ట్రెసరర్ రేచల్, టి‌ఎన్‌జి‌ఓ ప్రెసిడెంట్ (పి&ఈ)
రాజయ్య గౌడ్, సెక్రెటరీ కె.శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్. శ్రీనివాస రావు, ట్రెసరర్ విశ్వేశ్వర్ రావు మరియు
అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RTN_0918

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *