సిరిసిల్ల కరువు తీర్చిన కేటీఆర్

ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా నేతన్నలకు ఉపాధి భరోసా లభించింది. రాజీవ్ విద్యామిషన్ ద్వారా పాఠశాలల విద్యార్థుల యానిఫాంల తయారీ కోసం తొలిసారిగా సిరిసిల్ల మరమగ్గాలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది. ఈ పథకం ద్వారా వంద మాక్స్ సొసైటీల్లో 1500 మంది సభ్యులుండగా, సుమారు 15వేల మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు లభించాయి. 13 వేల సాంచాలపై వస్త్రాలు తయారు చేస్తున్నారు.

కేటీఆర్ ప్రభుత్వంలో ఉంటూ తనను గెలిపించిన సిరిసిల్ల నేతన్నలకు చేసిన మంచి మేలు ఇది..ప్రయోగాత్మకంగా రాజీవ్ విద్యామిషన్ సంస్థ ద్వారా రూ.40కోట్లతో 1.14కోట్ల మీటర్ల వస్త్రాల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ వస్ర్తాల తయారీతో ఇటు యజమానులు, ఆసాములు, కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. జిల్లాలో 40 వేల మరమగ్గాలున్నాయి. ఇందులో సుమారు 25వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సాంచాలు, భీంలు నింపే, కండెల చుట్టే కార్మికులతో పాటు ట్రాన్స్‌పోర్టు హమాలీలకూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించింది. వస్త్ర ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందున పరిశ్రమ అభివృద్ధిలో మందడుగు వేస్తున్నది. ప్రస్థుతం ఇచ్చిన ఆర్డర్ల మేరకు వస్త్ర ఉత్పత్తులు తయారు చేశారు. ఇంకా 20శాతం మాత్రమే మిగిలి పోయింది. ప్రభుత్వం కల్పించిన అవకాశంతో సిరిసిల్ల నేతన్నల తలరాతే మారిపోయింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *