ఇదీ రిలయెన్స్ జియో ఉచిత రహస్యం.

ముఖేష్ అంబానీ తీసుకొచ్చిన జియో సంచ‌ల‌నం ఇప్పుడు దేశాన్ని ఊపేస్తుంది. స‌హ‌చ‌ర ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడా వంటి టెల్కొలు వ‌ణికిపోతున్నాయి. అయితే, ఈ ముఖేష్ ఇప్పుడెందుకు దేశ సేవ చేయ‌డానికి వ‌చ్చారు.  ఫ్రీగా సిమ్‌లు పంచుతూ ఫ్రీగా వాయిస్ కాల్స్ ఇస్తూ… ప్ర‌జ‌ల‌ను ఉచితంగా అల‌రించాల‌నుకుంటున్నారా?ముఖేశ్ ఓ క‌ర‌డుగ‌ట్టిన పారిశ్రామిక‌వేత్త‌. లాభాలు లేకుండా ఏ ప‌ని చేయ‌ని బిజినెస్ మ్యాన్‌. అలాంటి ముఖేశ్ఎందుకు ఉచితాలంటూ ఊద‌ర‌గొడుతున్నారు. టెలికాం రంగంలోనిమిగిలిన దిగ్గ‌జ సంస్థ‌లకు ఎందుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. దీని వెనుక వాస్త‌వాల‌ను ఎవ‌రూ చెప్ప‌డం లేదు. ఎంతో ఖ‌రీదైన 4జీ సేవ‌ల‌ను ముఖేశ్ ఊర‌క‌నే పప్పు బెల్లాల్లా ఎందుకు పంచాల‌నుకుంటున్నారోవిశ్లేషించే సాహ‌సం చేయ‌ట్లేదు. దీని వెనుక పెద్ద 4జీ దోపీడీ ప్లాన్ ఉంది. ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌ను దెబ్బ‌కొట్టి వాటి వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా ముఖేశ్ ఈ ఉచితానికి తెర తీశారు. నిజానికి ఇందులో వినియోగ‌దారుల జేబుకు కూడా భారీగా చిల్లు పెట్టే వ్యూహం దాగుంది. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ముఖేశ్ చెబుతున్న‌ట్లు ఇందులో ఉచితం ఏమీ లేదు.ముందు మూడు నెల‌లు లాంఛింగ్ ఆఫ‌ర్‌లో మాత్ర‌మే ఉచిత సేవ‌లు అందుబాటులో ఉంటాయి. ఆ త‌ర్వాత ఒక జీబీ డేటాను రూ.50లు పెట్టి కొనాల్సిందే. అలా కొన్న డేటా ఆన్ చేయ‌కుండా కాల్స్ మాట్లాడుకుంటామంటే కుద‌ర‌దు. జియో నుంచి కాల్స్ చేయాలంటే క‌చ్చితంగా మొబైల్ డేటా ఆన్‌లో ఉండాల్సిందే. దీని ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవాలంటే ప్ర‌త్యేకంగా రూపొందించిన యాప్‌ను వాడాలి. ఆ యాప్ ప‌ని చేయాలంటే డేటా ఆన్‌లో ఉండాల్సిందే. అంటే కాల్ మాట్లాడుతున్న ప్ర‌తిసారీ డేటా ఖ‌ర్చ‌వుతూనే ఉంటుంది.అంటే కాల్స్ ఫ్రీ బ‌ట్ డేటా కాదు… డేటా అయిపోగానే మ‌ళ్లీ రీచార్జ్ చేసుకోవాలి. అంటే మిగిలిన ఫోన్ల‌లో కాల్స్ చేసుకున‌రేందుకు రిచార్జి చేసుకుంటాం. జియోలో మాత్రం డేటా అయిపోగానే రీచార్జి చేసుకుంటాం. కాల్స్‌కు పెట్టే డ‌బ్బులు డేటాకు పెట్టాల‌న్న‌మాట‌. ఇక్క‌డా ఓ భారీ దోపిడీ ఉంది. 2జీ, 3జీ కంటే 4జీ సేవ‌లు ఎంతో ఖ‌రిదైన‌వి. అలాగే డేటా వినియోగం కూడా 4జీలో ఎక్కువ‌గాఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు 2జీలో 1జీబీ డేటా 10 రోజులు వ‌స్తుంద‌నుకుందాం… అదే 4జీలో 1 జీబీ డేటా నాలుగు రోజ‌ల్లో అయిపోవ‌చ్చు. మ‌నం ఫోన్ కాల్స్ మాట్లాడే దాన్నిబ‌ట్టి…. నెట్ వాడేదాన్ని బ‌ట్టి అది ఇంకా వేగంగా కూడా అయిపోవ‌చ్చే. అంటే ఇలా డేటా అయిపోయిన ప్ర‌తిసారీ మ‌ళ్లీ రీచార్జ్ చేసుకోవాల్సిందే. అలా రీచార్జ్ చేసుకోకుంటే కాల్స్ చేయ‌లేం.ఉచిత దోపిడీ వెనుక టెక్ ర‌హ‌స్యం…రిల‌య‌న్స్ జియీలో వాయిస్ కాల్స్ కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన VoLTE టెక్నాలజీని వాడుతున్నారు. ఈ టెక్నాలజీ లేని యూజర్లు వాయిస్ కాల్స్ చేసుకోవాలంటే జియో ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా వాయిస్ కాల్ చేసుకోవాలన్నా మైబైల్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉండాల్సిందే. సో.. ఏ రకంగా చూసినా జియో ద్వారా చేసే ప్రతి కాల్‌కు నిర్ణయిత డేటా చార్జ్ అవుతుంది. అది కాల్‌కు చార్జ్ అయినట్లు యూజర్‌కు చూపించదు. అందువల్ల వాయిస్‌కాల్ ఫ్రీ అని వినియోగదారుడు భ్రమ పడుతాడు. ఇదీ రిలయెన్స్ జియో ఉచిత రహస్యం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *