హరీష్ లో ఉన్న మేజిక్కే ఇదీ..

harish

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవ్వరు ఔనన్నా.. కాదన్నా.. ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయి. కృష్ణ , గోదావరి నదులపై చేపట్టిన ప్రాజెక్టులను యువ కిశోరం.. హరీష్ రావు ఉరుకులు పరుగులు పెట్టిస్తూ నెలలో ఒక్కసారైనా సందర్శిస్తూ వేగంగా పూర్తి చేయిస్తున్నారు. తనకు అప్పగించిన పనిని వేగంగా పూర్తి చేసి దాని ఫలితం రాబట్టడంలో హరీష్ రావుది అందవేసిన చేయి.. అందుకే వేలకోట్లు ఖర్చు చేస్తున్న ప్రాజెక్టుల విషయంలో భారీ నీటిపారుదల శాఖను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్.. కేసీఆర్ ప్రారంభించిన కాళేశ్వర పాలమూరు పథకాలపై ఇప్పటికే ఏపీ మోకాలడ్డుతోంది. రైతులు, నాయకులు సుప్రీంలో పిటీషన్లు వేసి ప్రాజెక్టులు నడవకుండా అడ్డుకుంటోంది. దీంతో సైలెంట్ గా పనులు జరిగేలా ప్రారంభోత్సవాలు సాగేలా ప్లాన్ చేశారు. అందుకే కేసీఆర్ ప్రారంభోత్సవాలకు రాకుండా హరీష్ తోనే అంతా నడిపిస్తున్నారు. దీంతో ఒకప్పుడు వలసలతో అల్లకల్లోలం అయిన పాలుమూరు ఇప్పుడు కృష్ణ జలాలతో పావనం అవుతోంది. బీడు వారిన పొలాలకు కృష్ణ నీటిని తరలిస్తున్నారు. నిన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన హరీష్ రావు నీటిని విడుదల చేసి పాలమూరు ఏళ్లగోసకు స్వస్తి పలికారు. ఇలానే అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సస్యశ్యామలం చేయాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *