Breaking News

ఇదీ మినరల్ వాటర్ అంట.. తాగితే ఖతమే..

02

నీటి వ్యాపారం లక్షలు కురిపిస్తోంది. మినరల్ వాటర్ పేరిట నాసిరకం నీరు సరఫరా చేస్తూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. బోరు నీటినే మినరల్ వాటర్ అంటూ మభ్యపెడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. జనం మినరల్ వాటర్ కు ఎక్కువగా ఆసక్తి చూపడంతో ఇప్పుడు కాసులు కురిపించే వ్యాపారంగా మారింది. ఒక్కో 20 లీటర్ల బాటిల్ కు 20 రూపాయల చొప్పున వసూలు చేస్తూ చెత్త చెదారం, నాచుతో నిండిన నీటిని వినియోగదారులకు అంటగడుతున్నారు. ఈ నీటిని తాగి జనం రోగాల బారిన పడుతున్నారు.

03

కరీంనగరంలోని భగత్ నగర్ పెద్దమ్మగుడి వద్దనున్న ఓ వాటర్ ఫిల్టర్ నిర్వాహకులు సరఫరా చేసిన వాటర్ క్యాన్లలో నాచు, చెత్త చెదారం కనిపించింది. కనీసం శుభ్రం చేయకుండా.. ఫిల్టర్ చేయకుండా బోరు వాటర్ నే నింపి వినియోగదారులకు సరఫరా చేసేశారు. దీన్ని గుర్తించిన వినియోగదారులు సదరు వాటర్ ఫిల్టర్ నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా వెలుస్తూ జనం ప్రాణాలతో ఆటలాడుకుంటున్న ఈ వాటర్ ఫిల్టర్ కేంద్రాలను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

01

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *