పత్రికల గొప్పదనమే ఇదీ..

-జాతీయ పత్రికా దినోత్సవం? ?*
 పత్రికలు సమాజానికి వెలుగు రేఖలు లాంటివి.. ప్రభుత్వాల కళ్లు తెరిపించే చుక్కాని లాంటివి.. పత్రికలు ప్రజాస్వామ్యంలో ఒక మూల స్తంభం.. అనార్థుల ఆకలిని.. వారి బాధలను సమాజానికి తెలిపేవి.. అటువంటి పత్రికలకు ఒకరోజుంది.. భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16 వ తేదిన జాతీయ పత్రికాదినోత్సవం జరుపుకుంటారు
 
?1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16 వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసారు, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికా(నేషనల్‌ ప్రెస్‌ డే) దినోత్సవాన్ని జరుపుకుంటారు.
 
?ఒక దేశము లో ప్రజాస్వామ్య ము సక్రమము గా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకోవాలంటే ఆ దేశము లో పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు . పత్రికా రంగము మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్ర్యము అమలవు తుంటే ఆ దేశము లో ప్రజాస్వామ్య పాలనకు , చట్టబద్దపాలనకు ఢోకాలేనట్టే .
 
?ప్రెస్‌ కౌన్సిల్‌ పత్రికారంగాన్ని పరిశీలించటంతో పాటు వార్తల తీరుతెన్నులపై వచ్చిన ఫిర్యాదు లను పరిశీలించి వృత్తిపరమైన అక్రమాలకు పాల్పడిన పత్రికలు, సంస్థల చర్యలను విమర్శించటం, అభిశంసించటం, చర్యలకు సిఫార్సు చేస్తుంది. పత్రికా స్వేచ్ఛ కోసం పనిచేయాలన్నది లక్ష్యం.
 
?ప్రపంచంలో అనేక దేశాలలో ప్రెస్‌ కౌన్సిళ్లు ఉన్నాయి. అయితే మనదేశ కౌన్సిల్‌కు ఉన్న ప్రత్యేకత ేమంటే ప్రభుత్వశాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం కలిగి ఉంది. పత్రికలు, మీడియా స్వయంగా ఉన్నత ప్రమాణాలను నిర్ణయించుకొని అమలు జరిపే విధంగా ప్రెస్‌కౌన్సిల్‌ ప్రోత్సహిస్తుంది.
 
?గత పన్నెండు సంవత్సరాలుగా ప్రెస్‌ కౌన్సిల్‌ పత్రికా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల గురించి ప్రతి నవంబరు 16న సెమినార్లు నిర్వహిస్తున్నది.
 
?అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19 ఆర్టికల్‌కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినంగా మే 3వ తేదీని ప్రకటించింది…

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *