మోడీ నోట్ల రద్దు వాళ్లకు ముందే తెలుసు.. అందుకే సర్దుకున్నారు..

ప్రధాని నరేంద్ర మోడీ ఆరునెలల ముందుగానే మైసూరులో రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ను సీక్రెట్ గా స్టార్ట్ చేయించాడట. అక్కడి నుంచి ప్రైవేటు చార్టెడ్ ఫ్లైట్ ద్వారా ఢిల్లీలోని ఆర్ బీ.ఐ కేంద్ర కార్యాలయానికి నోట్ల తరలింపును చేశారట.. ఇందుకోసం చాలా ఖర్చు చేశారు. ఈ విషయం మూడో కంటికి కూడా తెలియదు.. కానీ మోడీ సన్నిహితులకు తెలుసనే ప్రచారం ఊపందుకుంది. మోడీ బీజేపీ నేతలకు ఈ విషయం ముందే తెలుసు అని అందుకే జూన్ లో పశ్చిమబెంగాల్ బీజేపీ శాఖ వారు కోటి రూపాయల నగదును బ్యాంకులో డిపాజిట్ చేశారని.. ఆప్ మాజీ నేత, ప్రఖ్యాత సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ ట్విట్టర్ లో బాంబు పేల్చారు. బీజేపీ నేతలంతా ఆరునెలల ముందే తమ బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక మోడీ నోట్ల రద్దు వెనుక పెద్ద స్కెచే ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ విషయం ముందే తెలుసే ఏమో.. భారత దేశంలోనే పెద్ద దనవంతుడు అయిన ముఖేష్ అంబానీ తన దగ్గర ఉన్న సొమ్ము, బ్లాక్ మనీని అంతా కొత్తగా తెరపైకి వచ్చిన సెల్ ఫోన్ నెట్ వర్క్ జియోలో పెట్టుబడిగా పెట్టాడనే ప్రచారం జరుగుతోంది. మోడీ ఉప్పందించడంతోనే ముఖేష్ అంబానీ జియో కోసం భారీగా నల్లడబ్బును ఖర్చు పెట్టాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అదానీ గ్రూప్ కూడా విదేశాల్లో వివిధ పెట్రోల్, బొగ్గు తదితర ప్లాంట్లను కొనుగోలు చేసి నల్లడబ్బును వినియోగించుకున్నారనే విమర్శలున్నాయి. మొత్తానికి మోడీ సీక్రెట్ ను తన సన్నిహితులకు చెప్పి లాభం చేకూర్చగా మిగతా బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, నల్లకుబేరులను మాత్రం కష్టాల్లో నెట్టాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *