Breaking News

దురదృష్టం అంటే సిరిసిల్ల, హుస్నాబాద్ దే..

Siricilla-Town-Municipality-exploretelangana1

దురదృష్టం అంటే సిరిసిల్ల , హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలదే.. ఎందుకంటే రాజకీయ సమీకరణాల్లో ఈ రెండు నియోజకవర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ సిరిసిల్లను ఎలాగైనా జిల్లా ను చేస్తాడనే ప్రచారం ఉండేది. కానీ చివరకు విస్తీర్ణం, మండలాల కొరతతో అది సాధ్యపడలేదు. అదే సమయంలో కనీసం సోదిలో లేని.. డిమాండ్ చేయని పెద్దపల్లికి జిల్లా అదృష్టం పట్టింది.. అందుకే ఇప్పుడు సిరిసిల్ల వాసులు దీనిపై మండిపడుతున్నారు.  బంద్ కు పిలుపునిచ్చారు.

ఇక హుస్నాబాద్ వాసుల కథ అయితే మారీ దారుణం.. జిల్లాలో పునర్విభజనలో హుస్నాబాద్ నియోజకవర్గమే లేకుండా పోతోంది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, కోహెడ మండలాలు సిద్దిపేటలో కలుస్తున్నాయి. ఇక ఎల్కతుర్తి , భీమదేవరపల్లి వరంగల్ జిల్లాలో కలుస్తున్నాయి. సైదా, చిగురుమామిడి మండలాలు కరీంనగర్ జిల్లాలో కలుస్తున్నాయి. దీంతో ఈ నియోజకవర్గమే చిన్నాభిన్నం అవుతోంది. ఎమ్మెల్యే సతీష్ బాబు అసమర్థత, అనాలోచిత నిర్ణయాల వల్ల దశాబ్దాల హుస్నాబాద్ చరిత ఇలా విడిపోయి ఆగమైపోతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *