కలల వెనక రహస్యాలు..

కలలు మనకి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. అప్పుడప్పుడు భయంకరమైన ప్రదేశాలకు తీసుకెలతాయి. నరకం అంటే ఇదే కాబోలు అనిపిస్తుంది. కొన్ని సార్లు మన కలలో జరిగిన సంఘటన నిజ జీవితంలో జరుగుతుంది అనిపిస్తుంది. ఇలా ఎన్నో వింతలను పరిచయం చేసే కలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం!!

* కలలో చదవడం లేదా రాయడం!

మనం మేల్కొని ఉన్నామా లేక కలలో ఉన్నామా అనే సందేహం అప్పుడప్పుడు వస్తుంది. ఇలాంటి సమయంలో ఏదైనా చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు కలలో ఉన్నప్పుడు చదవడం కుదరదు. అలాగే గడియారాన్ని చూసినప్పుడు ఒక్కో సందర్భంలో ఒక్కో టైం చూపిస్తుంది.

* కలలో భవిష్యత్తు!

మీకు ఎప్పుడో ఎదురైన సందర్భమే.. మరో సారి అదే విధంగా జరుతున్నట్టు అనిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుందో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. ఇలా భవిష్యత్తుని ముందే చూసిన కొన్ని సంఘటనలలో ఫేమస్ అయినవి కొన్ని ఉన్నాయి. తాను హత్యకు గురవుతాడని ముందే కలగన్నాడట అబ్రహం లింకన్. 9/11 ఘటన జరుగుతుందని ముందే కలగన్నామని ఆ ఘటనలో బ్రతికిన కొందరు పేర్కొన్నారు. టైటానిక్ షిప్ మునిగిపోతుందని 19 మంది కలగన్నారట.

* స్లీప్ పెరాలిసిస్ / నిద్రలో పక్షవాతం!

స్లీప్ పెరాలిసిస్ వచ్చినప్పుడు నరకం అంటే ఇదే కాబోలు అనిపిస్తుంది. మీరు మేల్కొనే ఉంటారు గాని కదలలేక పోతారు… మీ గదిలో కీడు కలిగించే అదృశ్య శక్తి ఏదో ఉందని అనిపిస్తుంది. కాళ్ళు, చేతులు కదపలేకపోతారు… మీ పై 1000 కిలోల బరువు వేసినట్టు అనిపిస్తుంది… గట్టిగా అరవాలని అనిపిస్తుంది గాని కనీసం పెదాలు కూడా కదపడానికి రాదూ… ఇలా మీకెప్పుడైనా జరిగి ఉంటే దాన్నే స్లీప్ పెరాలిసిస్ అంటారు. భయం, ఆతురత లాంటివి ఎక్కువగా ఉనప్పుడు మీకు ఇలా జరుగుతుంది.

* స్లీప్ వాకింగ్!

నిద్రలో నడిచే అలవాటు ఉన్నవారు చేసే పనులు వింటే చాలా తమాషాగా ఉంటుంది గాని.. ఇది చాలా ప్రమాదకరం. కేవలం వారికే కాదు.. ఇతరులకి కూడా చాలా ప్రమాదం. లీ హడ్విన్ అనే అతను ఓ హాస్పిటల్ లో పని చేసేవాడు. అతను తన కలలో నిద్ర లేచి అద్భుతమైన పెయింటింగ్స్ వేసేవాడట. కాని నిద్ర లేచిన తరవాత అతనికి అవేవి గుర్తుండేవి కాదట. ఒకతను తన కారులో 22 మైళ్ళు ప్రయాణించి తన చుట్టాన్ని చంపెసాడట. మరొకతను నిద్రలో నడుస్తూ 3వ ఫ్లోర్ నుండి దూకేసాడు… తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు.

* బ్రెయిన్ చురుకుదనం!

ఏ గొడవా లేకుండా ప్రశాంతంగా నిద్రలోకి జారుకోవాలని అనుకుంటారు అందరు. కాని మన మెదడు నిద్రలోనే ఎక్కువ చురుకుగా పని చేస్తుందట.

* జంతువులు – కలలు!

మీరెప్పుడైనా గమనించారా? మన పెంపుడు జంతువులు అప్పుడప్పుడు నిద్రలో కాళ్ళు కదుపుతూ ఉంటాయి. ముఖ్యంగా వాటిని ఏదో తరుముతున్నట్టు… లేదా ఇవే వేటినో తరుముతున్నట్టు.. వింత వింత శాభ్దాలు చేస్తూ ఉంటాయి. జంతువులు కూడా కలలుగంటాయి అనడానికి ఇదే నిదర్శనం.

* కలగంటారు కాని మరచిపోతారు!

అసలు నాకు కలలే రావు అని అంటారు కొంత మంది. నిజానికి ప్రతీ ఒక్కరు కలగంటారు. కాకపోతే నిద్ర లేచాక అవి గుర్తుండవు అంతే. 60 శాతం మందికి అసలు వారు ఏ కలగన్నారో గుర్తుఉండవని తేలింది.

* అంధులు – కలలు!

పుట్టిన కొన్ని రోజులకి అందులైనా వారికి వారి కలలో కొన్ని ఆకారాలు కనిపిస్తాయి. కాని పుట్టుకతో అందులుగా ఉన్నవారికి అలాంటి ఆకారాలు కనిపీయక పోయినా వారు కూడా కలలుగంటారు. కాకపోతే చూపు కాకుండా ఇతర స్పర్శల గురించి వీరు కలగంటారు.

* కలలో కొత్త ముఖాలు!

మీరు ఎంత ప్రయత్నించినా.. మీ కలలో కొత్త ముఖాన్ని చూడలేరు. మనకు బాగా పరిచయం ఉన్న ముఖాలను…. అలాగే ఎప్పుడో, ఎక్కడో చూసిన ముఖాలనే తిరిగి మన కలలో చూడగలుగుతాము.

* కలలు నెగటివ్ గా వస్తాయి!

ఎక్కువ శాతం కలలు నెగటివ్ గానే వస్తాయి. వీటిలో ముఖ్యంగా కనిపించే లక్షణాలు.. కోపం, భయం, భాధ.

* ఒక రాత్రికి ఎన్ని కలలు!

7 నుండి 8 గంటలు పడుకునే వారు 7 కలలుగనే అవకాశముందని తేలింది. ఒక్కోసారి 2 గంటలు ఒకే కలలో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయట.

* కలర్ కలలు

కేవలం 12 శాతం మంది కలర్ కలలుగంటారట. మిగితా వారందరు బ్లాక్ & వైట్ కే అంకితం

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *