Breaking News

వారంలో గురుకుల టీచర్ల భర్తీకి నోటిఫికేషన్

Telangana-Gurukula-Teachers-jobs

-కసరత్తు చేస్తున్న టీఎస్ పీఎస్సీ
– గ్రూప్‌-2 అనుబంధ నోటిఫికేషన్ కూడా త్వరలోనే

తెలంగాణలో గురుకుల విద్యాసంస్థల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది. మరో వారంలో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు టీఎ్‌సపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల సొసైటీలు, విద్యాశాఖ పరిధిలోని టీఎస్‌ గురుకులాల్లో 2,4,44 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే గురుకుల విద్యాసంస్థల్లోని టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్‌, లెక్చరర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులన్నీ జోనల్‌ పోస్టులుగా ఉన్నాయి. జోనల్‌ వ్యవస్థను రద్దు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. కానీ ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం ఆరు నెలలు పడుతుంది. ఈ నేపథ్యంలో జోనల్‌ పోస్టుల భర్తీని ఆపాల్సిన అవసరం లేదనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *