‘వార్త’ పత్రికను తీసుకుంటున్న సీఎల్ రాజాం

mr-cl-rajam-jpg

సీఎల్ రాజాం మంచి ఫౌండర్..వ్యాపారవేత్త.. మాంచి దర్శకునిడిగా ముందుకెళ్లే పారిశ్రామికవేత్త.. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ కు అండగా నిలిచారు. ఆంధ్రా పత్రికలు రాజ్యమేలుతున్న ఆ సమయంలో తెలంగాణకోసం టీఆర్ఎస్ అండతో నమస్తే తెలంగాణ పత్రికను స్థాపించాడు. దాన్ని తెలంగాణలో ఓ స్థాయికి తీసుకెళ్లాడు.. ఆయన గొప్పలక్షణం ఏంటంటే ఆయనకు ఆనందం వచ్చినా., దు:ఖం కలిగినా అందరితో పంచుకుంటాడు.. అతడి కుటుంబసభ్యుల పుట్టిన రోజు నాడు ఉద్యోగులకు ఏదైనా బహుమతులు కానీ.. బోనస్ లుగాని ఇస్తుంటారు. అప్పట్లో రాజాం మనవరాలి పుట్టినరోజునాడు నమస్తే తెలంగాణ ఉద్యోగులకు   గిఫ్ట్ లు బోనస్ లు కూడా ఇచ్చాడు.. ఏ పత్రికలో అప్పటివరకు ఇలాంటి ధోరణిని ఎవరూ చూడలేదు.  అలాంటి యజమాని ఉంటే ఉద్యోగుల జీవితాలు బాగుంటాయని అందరు జర్నలిస్టులు ఆశించారు. కానీ ఆయన ప్రస్థానం నమస్తే తెలంగాణ పత్రికతోనే ముగిసిపోలేదు.. ఇప్పుడు అదే సీఎల్ రాజాం కొత్త పత్రికతో వస్తున్నాడు..
కొద్ది సంవత్సరాల క్రితం తాను స్థాపించిన నమస్తే తెలంగాణ పత్రికను టీఆర్ఎస్ తో విభేధాల కారణంగా వదిలేశాడు.  దాన్ని సీఎండీగా వైదొలిగాడు.. అనంతరం పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరాడు.. ఇప్పుడు స్వతహాగా పత్రికాభిమాని అయిన రాజాం ఒకప్పుడు బాగా వెలుగు వెలిగి ప్రస్తుతం అవసాన దశలో ఉన్న  ‘వార్త’ పత్రిక కొనుగోలుకు ప్రయత్నిస్తున్నాడు. ఆల్ రెడీ దీన్ని డీల్ కుదిరిందని.. త్వరలోనే వార్త పత్రికను పేరు మార్చి తెలంగాణలో తీసుకురావాలని యోచిస్తున్నాడట.. సో జర్నలిస్టులు మరో పత్రిక రాబోతోంది. మంచి నాయకుడి మార్గదర్శకత్వంలో రాబోతున్న ఇందులో చేరడానికి రెడీ అవ్వండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *