చనిపోయాక వచ్చేది డబ్బు కాదు..

చనిపోయాక నీ వెంట ఏదీ రాదు.. అందుకే బతికి ఉన్నప్పుడే ఏదైనా మంచి చేయి.. కుటుంబం, సమాజంలో సంతోషం గా ఉండు.. ఇదే మన జీవిత సారం.. ప్రధాని మోడీ రూ.500, 1000 నోట్ల రద్దుతో వేలకోట్ల నల్లధనం వృథా అవుతోంది. కోట్లు కూడబెట్టిన బకాసురుల పైసలు వేస్ట్ అవుతున్నాయి. అందుకే డబ్బు కాదు ముఖ్యం.. అనుబందాలేనన్న గొప్ప వారి మాటలు అనుభవ పూర్వకంగా మన ముందున్నాయి..

*ఆపిల్* కంపెనీ సృష్టికర్త,ప్రపంచ మేధావుల్లో ఒకరైన *”స్టీవ్ జాబ్స్”*ఆసుపత్రిలో , తన ఆఖరి రోజుల్లో డైరీలో రాసుకున్న మాటలు అందరిలోనూ దిగ్ర్భాంతిని ఆలోచనను డబ్బు ముఖ్యం కాదనే భావనను కలిగించాయి. ఆయన డైరిలో రాసుకున్న విశేషాలు ఇవీ..

‘‘వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను నేను.
విజయానికి ప్రతీకగా నిలిచాను.
పని తప్ప నాకు వేరే ఆనందం తెలీదు.
సంపాదనకే అంకితమైపోయాను.
ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్కపెట్టుకుంటున్న
నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే,

ఇన్నాళ్ళూ నేను గర్వపడిన పేరూ డబ్బూ ఎందుకూ కొరగానివని నాకు అనిపిస్తోంది .

ఈ నిశిరాత్రిలో …
నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది.

నాకిప్పుడనిపిస్తోంది…

జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక,
మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి.
కళలూ , అనుబంధాలూ , చిన్నపాటి కలలూ , కోరికలూ , సేవ ……….
ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది .
కానీ డబ్బు వెనుక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది .
అందుకు నేనే ఉదాహరణ .

ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువనిచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం.

నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు .
నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు .
నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులూ,
అందమైన జ్ఞాపకాలు మాత్రమే .
ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి.
మనల్ని ఉన్నతస్థాయికి చేరుస్తాయి .

నిజం , అంతా మన హృదయంలోనే , మన చేతుల్లోనే ఉంది .
ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా?……..
నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం.
నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ ను నియమించుకోగలవు .
నీ కోసం సంపాదించిపెట్టగలిగే ఉద్యోగులను నియమించుకోగలవు.
కానీ , నీ జబ్బునూ , నీ బాధనూ అనుభవించే వ్యక్తిని మాత్రం
ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు .
నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చుగానీ
చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు .

జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా –
కథ ముగిసే రోజు , తెరపడే రోజు ఒకటి వస్తుంది .
అప్పుడు – ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు .

అందుకే …,
కాస్త ముందే కళ్ళు తెరువు .

*డబ్బును* కాదు ,

నీ *కుటుంబాన్ని*ప్రేమించు .

నీ *స్నేహితులను* ప్రేమించు .

ఆనందంగా జీవించు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *