గుడ్డు సున్నా కాదు.. అన్నింటికన్నా మిన్న!

EggsInShell

ఈ ప్రపంచంలో..మంచి రుచికరమైన, సురక్షితమైన, పోషకాలన్నీ సమృద్ధిగా ఉన్న, చవకైన, చిటుక్కున వండుకోవటానికి వీలైన, అన్ని కాలాల్లోనూ దొరికే, అన్ని వయసుల వారికీ నచ్చే ఆరోగ్యకరమైన ఆహార పదార్థం ఏదైనా ఉందా…?సమాధానం ఒక్కటే! గుడ్డు!
పట్టుమని 50 గ్రాములు కూడా ఉండని ఒక్క చిన్న గుడ్డులో ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టే ప్రపంచం యావత్తూ గుడ్డును అమింతంగా ఆస్వాదిస్తోంది. చాలామంది రుచిగా ఉండే ఆహారంలో పోషకాలుండవనీ, పోషకాలుండే ఆహారానికి రుచీపచీ ఉండవని భావిస్తుంటారు. కానీ రుచినీ, ఆరోగ్యాన్నీ.. రెంటినీ రంగరించి మనకందించే సహజ ఆహారం.. గుడ్డు!

పాలకు సరిసాటిగా నిలిచే సంపూర్ణ ఆహారం.. గుడ్డు! విటమిన్‌-సి, పీచు పదార్థం- ఈ రెండూ తప్పించి మిగతా అన్ని పోషకాలూ, అన్ని విటమిన్లూ, ఖనిజాలూ ఉంటాయి వీటిలో. ఈ రెంటిలో కూడా గుడ్డు ఎంతో ప్రత్యేకమైన ఆహారం! ఎందుకంటే దీనికి పైన గట్టి పెంకు ఉంటుంది కాబట్టి కలుషితం కాదు. త్వరగా పాడవ్వదు. ఒక్క గుడ్డు తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. తిన్న తర్వాత త్వరగా ఆకలి వేయదు. ఉడికించి తినొచ్చు కాబట్టి నూనెల బెడద ఉండదు. అన్నింటినీ మించి ఎంతో రుచికరమైనది కూడా. అన్ని వయసుల వారికి కావాల్సిన పోషకాలూ దీనిలో దండిగా ఉంటాయి. అందుకే ప్రపంచంలో రుచికరమైన, ఆరోగ్యకరమైన పదార్థాల్లో గుడ్డు ముందు వరుసలో నిలుస్తుంది. ప్రస్తుతం చాలామంది రోజువారీ ఆహారంలో- బియ్యం, గోధుమల వంటి ఏదో ఒక ధాన్యం.. ఒక కూర, అప్పుడప్పుడు పప్పు, కొద్దిగా పాలు, లేదా పెరుగు, కొంచెం నూనె.. ఇలా నాలుగైదు రకాల పదార్ధాల కంటే ఎక్కువ తీసుకోవటం లేదు. ఈ నేపథ్యంలో దైనందిన ఆహారంలో గుడ్డు కూడా ఉండేలా చూసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు, పోషకాలు దండిగా లభిస్తాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *