దేశంలో ఓ పెద్ద నది కనుమరుగైంది..

భారత దేశమంటేనే నదీనదాల వరప్రసాదం.. గంగా, యమన, సింధూ, గోదావరి, కృష్నా వంటి ఎన్నో నదులు భారత దేశాన్ని పావనం చేశాయి. కానీ కొన్నే వందల సంవత్సరాల క్రితం పురణాల్లో పేర్కొన్నట్టు భారత దేశంలో సరస్వతీ నది ప్రవహించేది. ద్వాపార కృష్ణుడి అవతారంలో సరస్వతీ నది గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం హర్యానాలోని శివాలిక్ కనుమల్లోని బద్రీలో పుట్టిన ఈ నది చౌతాంగ్ నదిలో కలిసేదని చరిత్రకారులు చెప్పేవారు.
కాగా దీనిపై ఇటీవల విస్తృత పరిశోధనలు జరిగాయి. వాడియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హిమాలియన్ జియాలజీ(డబ్ల్యూఐహెచ్జీ) శాస్త్రవేత్తల పరిశోధనలో నమ్మలేని నిజాలు భయటపడ్డాయి. హిమాలయాల కిందుండే భూ ఫలకాల కదలికల తర్వాత సరస్వతీ గమనం మారిందని శాస్త్రవేత్తలు తేల్చారు.అనంతర కాలంలో పర్యావరణ విపత్తుల వల్ల నది అంతరించిపోయిందని కనిపెట్టారు. ఇప్పటికీ సరస్వతీ నదీ మార్గంలో నిల్వ ఉండే నీటిని పరిశోధించినప్పుడు ఈ వాస్తవాలు భయటపడ్డాయి. సరస్వతీ నదీమార్గంలో ఇప్పుడు 5 అడుగుల మట్టి పేరుకుపోయింది. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్థానం అలహాబాద్ లో కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి సరస్వతీ ఉనికి కొన్నేళ్ల క్రితం ఉన్నట్టు తేలింది. సరస్వతీ కనుమరుగు కావడానికి హిమాలయాల్లోని భూ పలకలే కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *