
జర్నలిస్టులు అక్షర యోధులంటూ తేలు విజయ పాడిన పాట అందరి నోళ్ల నానుతోంది. ఆమె పాడిన పాటలో జర్నలిస్టుల కష్టాలు, కడగండ్లు వారు ఎదుర్కొనే బాధలతో పాటు విధి నిర్వహణలో జర్నలిస్టులు చూపే ప్రతిభ పాఠవాలు.. ప్రభుత్వ నిరాదరణను కళ్లకు కట్టాయి. ఇటీవల కరీంనగర్ లో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో తేలు విజయ పాటలు పాడి అలరించింది. ఈ కార్యక్రమంతో మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు ఎంపీ వినోద్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్ రెడ్డి, పుట్టమధు, మేయర్ రవీందర్ సింగ్, టీయూడబ్య్లూజే రాష్ట్ర అధ్యక్షుడ నగునూరి శేఖర్, టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాడూరి కరుణాకర్, గాంఢ్ల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ అయిలు రమేశ్ లు తేలు విజయ ను ప్రత్యేకంగా అభినందించారు. ఆమె పాటలు స్ఫూర్తినిచ్చాయని కొనియాడారు.
తేలు విజయ పాడిన పాటను పైన వీడియోలో చూడొచ్చు..