Breaking News

తెలంగాణ.. నిండుకుండలు

KADEMPROJECT

తెలంగాణ ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. నిండి గేట్లు ఎత్తి బయటకు నీళ్లను వదులుతున్నారు.. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని జలపాతాలు, వాగులు వంకలు పొంగి ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.. ఆదిలాబాద్ జిల్లాల్లోని కుంటాల, పొచ్చెర, మిట్ట తదితర జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని బొగతా జలపాతం అయితే నయాగరను తలపిస్తోంది. దీంతో పర్యాటకులు సందడి మొదలైంది. భారీ జనం జలపాతాల వద్దకు వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలంలోని సబ్బితం జలపాతం కూడా పారుతుండడం విశేషం.

కాగా మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణలో  కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు, మత్తడి వాగు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండడంతో గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. ఇక మహారాష్ట్రలో కురిసన వర్షాలకు ఎస్సీరెస్పీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉత్తర తెలంగాణ కు వర ప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ నిండుతుండడంతో దీనికింద సాగు చేసుకుంటున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ , వరంగల్ జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు తెలంగాణ నిండుకుండలా మారింది. ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *