తెలంగాణ పోలీసులకు ఏమైంది..?

వరుసగా ఆత్మహత్యలు.. ఎస్సై స్థాయి అధికారులు బలవన్మరణాలు తెలంగాణ పోలీస్ శాఖను కుదిపేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఉన్నతాధికారులు మైనింగ్ మాఫియా వసూళ్లపై ఒత్తిడి తెస్తున్నారని మెదక్ జిల్లాలోని ఓ ఎస్సై సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు.. నిన్న ఆదిలాబాద్ జిల్లా కెరమెరి ఎస్సైగా మూడు రోజుల క్రితమే పోస్టింగ్ పొందిన ఎస్సై సూసైడ్ చేసుకున్నాడు. ఈ రెండు ఆత్మహత్యలు తెలంగాణ పోలీస్ శాఖను కుదిపేస్తున్నాయి.

తెలంగాణ పోలీస్ శాఖలో లంచాలు, అవినీతి, దందాల గోల ఎక్కువైపోయినట్టు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ దందాలు ఆగడం లేదు. కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చిన ఎస్సైలు ఈ టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుంటున్నారు. తెలంగాణ పోలీస్ శాఖను ప్రక్షాళన చేస్తే కానీ ఈ దందాల పర్వం ఆగేలా లేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *