తెలంగాణలో జిల్లాల సంఖ్య ఇంకా పెరుగుతోందట..

telangana_new_districts

తెలంగాణలో ప్రస్తుతం 24 జిల్లాలు చేయాలనుకున్న సర్కారు ఆ మేరకు కలెక్టర్లకు ప్రతిపాదనలు రూపొందించమంది. ఈ నెల 20లోగా ప్రతిపాదనలు రెడీ చేయాలని సీఎం కేసీఆర్ గడిచిన సమావేశంలో కలెక్టర్ కు దిశానిర్ధేశం చేశారు. ఆ మేరకు ప్రజల డిమాండ్ల, నాయకుల కోర్కెల మేరకు ప్రతిపాదనలు రూపొందించిన కలెక్టర్లు 24కు బదులుగా మరో రెండు లేదా మూడు జిల్లాలు ఎక్కువనే ప్రతిపాదనలు తయారు చేశారట..

ఇందులో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల జిల్లా తెరపైకి వచ్చింది. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను జిల్లా కేంద్రం చేయాలని కొత్తగా కేసీఆర్ కరీంనగర్ కలెక్టర్ ను ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే మహబూబ్ నగర్ లో వనపర్తి జిల్లా కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. హైదరాబాద్ లో నాలుగు జిల్లాలను ఎక్కడ చేయాలనే దానిపై పీటముడి నెలకొంది. ఇక రంగారెడ్డి లోకూడా వికారాబాద్ చేస్తే రంగారెడ్డిని ఏం చేద్దామనే దానిపై ప్రతిష్టంభన నెలకొంది. వీటన్నింటి నేపథ్యంలో కొత్త జిల్లాల సంఖ్య మరింత పెరిగేందుకు అస్కారం కనపడుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *