
తెలంగాణలో నిన్నటి కలెక్టర్ల సమావేశంతో ఎన్ని జిల్లాలు ఏర్పాటవుతాయో స్పష్టత వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల తమకూ జిల్లాలు కావాలని డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే.. మహబూబ్ నగర్ లో గద్వాల, ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి, వరంగల్ లో జనగామ ఇలా పెద్దఎత్తున స్థానిక నేతలు ఆయా చోట్ల జిల్లాలు ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్నారు. కానీ ప్రభుత్వం వీటిని పట్టించుకున్నట్టు కనిపించడం లేదు..
కలెక్టర్లతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశంలో జిల్లాలపై స్పష్టత వచ్చింది. తెలంగాణలో మొత్తం 16 కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. హైదరాబాద్ లో సికింద్రాబాద్, ఖమ్మంలో భద్రాద్రి, నిజామాబాద్ లో కామారెడ్డి, ఆదిలాబాద్ లో మంచిర్యాల ఒక్కోటి చొప్పున జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. ఇక మిగతా మెదక్ లో 3, కరీంనగర్ లో 3, వరంగల్ లో 3, మహబూబ్ నగర్ లో 3, నల్గొండలో3 రంగారెడ్డిలో 3 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. .. వీటిన్నింటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే ముసాయిదా జారీ చేసి అభ్యంతరాలు స్వీకరిస్తుంది. అనంతరం దసరా నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభిస్తుంది..