కరీంనగర్ ను 3 జిల్లాలు చేస్తున్నారు..

knr

తెలంగాణలోనే ఆర్థిక, వ్యవసాయ రంగాల్లో దూసుకెళ్తున్న కరీంనగర్ జిల్లాను పునర్వ్యస్తీకరణలో భాగంగా 3 జిల్లాలుగా చేస్తున్నారు. ఈ నెల 20లోగా కలెక్టర్లు జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉండడంతో ఇప్పటికే కరీంనగర్ ను మూడు జిల్లాలుగా విడగొట్టి ఆమేరకు కలెక్టర్ నీతూ ప్రసాద్ నివేదికను రూపొందించారు.

ఇప్పుడున్న కరీంనగర్ లో 27 మండలాలు, జగిత్యాలకు 20 మండలాలు, సిరిసిల్లకు కేవలం 14 మండలాలతో జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ లోనే కాదు.. తెలంగాణలోనే అతితక్కువ మండలాలతో చిన్న జిల్లాగా ఏర్పడబోతోంది సిరిసిల్లనేనట.. మంత్రి కేటీఆర్ ఒత్తిడి మేరకు సీఎం కేసీఆర్ ఆఖరి నిమిషంలో సిరిసిల్ల ను జిల్లా చేయడంతో మండలాల సర్ధుబాటు కష్టమై ఈ మేరకు సిరిసిల్లలో చాలా తక్కువ మండలాలను కలిపారట.. దీంతో పాటు హుస్నాబాద్, కోహెడ మండలాలను, బెజ్జంకిలోని కొన్ని గ్రామాలను సిద్దిపేటలో కలుపుతున్నారు.

ఇక భూపాలపల్లి జిల్లాలో మంథని నియోజకవర్గంలోని 5 మండలాలు కలుపుతున్నారు. ఇక హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, ఇల్లందకుంట లను వరంగల్ జిల్లాలో కలుపుతున్నట్టు సమాచారం. ఇలా కరీంనగర్ జిల్లా ను విభజించి ప్రజాభిప్రాయాల ప్రకారం విభజిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *