టీడీపీ నేతను కాల్చేయడానికి తుపాకీ ఎక్కుపెట్టిన పోలీసు

hqdefault

రాజకీయ నేతలంటే ఏది పడితే అది అనొచ్చు.. అధికారులు పడి ఉంటారులే అన్న ధీమా అందరిలోనూ ఉండేది. కానీ పోలీసులు, అధికారులు మనుషులే వారు అంటే పడరు అని నిరూపితమైంది. తనను తిట్టిన రాజకీయ నేతపై ఏకంగా తుపాకీ ఎక్కుపెట్టి లోడ్ చేసి కాల్చి పారేయడానికి రెడీ అయ్యాడో పోలీసు.. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జైలు గేటు వద్ద జరిగింది. చొప్పదండి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి మేడిపల్లి సత్యం, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న విజయరమణారావును పరామర్శించేందుకు కరీంనగర్ జైలుకు నాయకులతో కలిసి వచ్చారు. లోనికి వెళ్తుండగా.. అక్కడే డ్యూటీలో ఉన్న సెంట్రీ ఆగమని సలహా ఇచ్చాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత సత్యం సెంట్రీ పోలీసును దూషించాడు. దీంతో ఆ మాటలకు ఆగ్రహం వ్యక్తం చేసిన సెంట్రీ తుపాకీ ఎత్తిపెట్టి కాల్చివేస్తానని బెదిరించాడు. కార్యకర్తలు, పోలీసులు ఇద్దరిని దూరంగా తీసుకుపోవడంతో వివాదం సద్దుమణిగింది. కాగా సెంట్రీపై చర్యలేమి లేవని.. కేవలం అతడు ఆగమంటే టీడీపీ నాయకులు తిట్టడం వల్లే ఆ సంఘటన జరిగిందని జైలు సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.

ఆ వీడియోను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *