నీవు నేర్పిందే.. ‘సాక్షి’ చేసింది కదా..

00babu sakshi

మార్చి 2న అమరావతిలో భూములు కొల్లగొట్టిన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై సాక్షి పత్రిక సవివర కథనాలతో ఆధారాలతో కథనాలు ప్రచురించింది. రైతుల నుంచి భూముల్ని కాజేసి వారిని మోసం చేసిన తీరును ఎండగట్టింది. దీనిపై ఏపీ మంత్రులు, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కక్ష సాధింపు చర్యలకు దిగింది..

notice

గుంటూరు సాక్షి కార్యాలయానికి పోలీసులు నోటీసులు అందించారు. సాక్షిలో మంత్రులు, ఎమ్మెల్యేల భూదందాపై ప్రచురించిన కథనాలకు ఆధారాలివ్వాలని లేకపోతే రాసిన, ప్రచురించిన వారిని జైల్లో వేస్తామని చంద్రబాబు ప్రభుత్వం హెచ్చరికలు పంపింది. అవినీతి కథనాలు ప్రచురించినందుకు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఏకంగా సాక్షిపైనే దాడులకు పూనుకుంది బాబు ప్రభుత్వం. అప్పట్లో వైఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ పైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలు సీరిస్ లు నడిపినా వైఎస్ ఎంతో ఓపిగ్గా, ప్రజాస్వామ్యంగా పత్రికలకు గౌరవం ఇచ్చాడు. అప్పుడు నవ్విన చంద్రబాబు ఇప్పుడు అదే పనిచేస్తున్న సాక్షిని టార్గెట్ చేయడంపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఆందోళనలకు శ్రీకారం చుట్టి సాక్షికి బాసటగా నిలవాలని నిర్ణయించాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *