Breaking News

ప్రాణాలు తీస్తున్న ప్రైవేటు బస్సులు

images

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికులు ఉసురు తీస్తున్నాయి. అప్పట్లో బెంగళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మహబూబ్ నగర్ జిల్లాలో అగ్నికి ఆహుతై 30 మంది వరకు చనిపోయారు. ఆ ఘటన మరువక ముందే ఈరోజు ఉదయం మరో ప్రైవేటు బస్సు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని కాలువలో బోల్తాపడింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. ఇంకా చాలామంది పరిస్థితి విషమంగా ఉంది..
హైదరాబాద్ నుంచి కాకినాడ కు వెళుతున్న ఒక ప్త్రెవేట్ ట్రావెల్స్ బస్సు ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద కాలువలో పడి 10 మంది మృతి మరో 18 మందికి తీవ్రగాయలు. బస్సులో మొత్తం 31 మంది ప్రయణకులు ఉన్నారు. ఈ ప్రమాదానికి కారుకుడైన బస్సు డ్త్రెవర్ పరారీలో ఉన్నాడు.ఈబస్సు నెల్లూరు కు చెందిన జనార్థన్ రెడ్డి పేరుతో ఉంది. రిజిస్ట్రేషన్ నెం: AP 26-TC 9512

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *