తెలంగాణ రక్తచరిత్ర స్మరించుకోవాల్సిన రోజుది..

download

వేల మంది సాయుధ పోరాట వీరుల రక్తచరిత్రకు సజీవ సాక్ష్యం తెలంగాణ సాయుధ పోరాటం.. వారి నెత్తుటి మరకలు తన గుండెల్లో దాచుకొని తెలంగాణ చరిత్రకు అందించింది. నైజాం సర్కారును గడగడలాడించిన నిర్మల్ గడ్డకు తెలంగాణ సాయుధ పోరాటంలో విశిష్ఠ స్థానం ఉంది. నైజాం పై గెరిల్లా పోరాటం చేసిన తెలంగాణ సాయుధ విప్లవకారులు తెలంగాణ విముక్తికి పోరాడారు. రజాకార్లకు ముచ్చెమటలు పట్టించారు. భారత ప్రభుత్వ సైనిక చర్యతో 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం తెలంగాణలో విలీనం అయ్యింది. దీన్ని విలీన దినమా.. విద్రోహ దినమా తేల్చుకోలేక ఇప్పటికీ ఆంధ్ర ప్రభుత్వం, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం జరపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఆ అమరుల త్యాగాలను తెలంగాణ విమోచన దినమైన నేడు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎందరో యోధులు…
అందరికీ జోహార్లు ?

? సాయుధవీరుల పోరాటబలం..
? అమరవీరుల త్యాగఫలం….
? రజాకార్ల పాలకులపై తిరుగులేని విజయం
? ముష్కర సంకెళ్ళు తెంచుకున్న తెలంగాణ.
? గుండెనిండా స్వేచ్చా వాయువు పీల్చిన దినం….

సెప్టెంబర్ – 17
?తెలంగాణ విమోచన దినోత్సవం?

తెలంగాణ జాతి యావత్తుకూ….
✊తెలంగాణ విమోచన దినోత్సవ ✊
?శుభాకాంక్షలు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *