Breaking News

తెలంగాణ జర్నలిస్టులు దురదృష్టవంతులు..

tuwj.jpg23

ఎన్ని ఆందోళనలు చేసినా.. రోడ్డెక్కినా.. వంటా వార్పు చేసినా.. స్పందన లేదు.. ‘అదే నిమ్మకు నీరెత్తని కేసీఆర్’ అంటూ మన శీర్షికలు పెట్టి రాసినా ఆయన పట్టించుకోవడం లేదు. ఎంతో కష్టపడి ఆందోళనలు చేసి సాధించుకున్న తెలంగాణలో జర్నలిస్టుల పరిస్థితి ఇలా అయ్యిందేంటబ్బా.. అని వాపోవడం తప్ప ప్రస్తుతం జర్నలిస్టులు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి..

10 రోజుల క్రితం తెలంగాణ వ్యాప్తంగా టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై జోరుగా ఆందోళనలు చేశారు. వంటావార్టు, చలో కలెక్టరేట్ అంటూ ధర్నాలు చేశారు. కానీ ఫలితం శూన్యం. పదిరోజులు కావస్తున్నా తెలంగాణ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యింది లేదు. అడుగు ముందుకు పడింది లేదు. ప్రభుత్వంతో జర్నలిస్టు నాయకులకు దగ్గరి సంబంధాలున్నా కూడా అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు తదితర జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. బహుశా జిల్లాల లొల్లిలో పడి ఇవన్నీ తెరమరుగయ్యాయయనే సందేహం నెలకొంది.. కేసీఆర్ పట్టుబడితే కానీ పరిష్కారం కానీ ఈ సమస్యలపై దేవుడిని ప్రార్థించడం తప్ప ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. అందుకే అనారోగ్యాలతో జర్నలిస్టులు చస్తున్నా కూడా కనికరం లేని ఈ తెలంగాణలో నిజంగా జర్నలిస్టులు దురదృష్టవంతులు అనడంలో సందేహం లేదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *