సౌదీని వదల లేదు..

నెత్తుటి క్రీడ కొనసాగుతోంది..  మొన్న ఇస్తాంబుల్, ఢాకా, నిన్న హైదరాబాద్, ఇప్పుడు సౌదీ అరేబియా ఇలా ఐఎస్ఐస్ ఉగ్రవాద మూకలకు అంతే లేకుండా పోతోంది..  నిన్న ఇరాక్ రాజధాని బగ్దాద్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. ట్రక్కులో భారీగా పేలుడు పదార్థాలతో వచ్చిన దుండగులు రంజాన్ సందర్భంగా కిక్కిరిసిన రంజాన్ షాపింగ్ లో వచ్చిన కుటుంబాలతో రద్దీగా ఉన్న ప్రాంతంలో బాంబులు పేల్చారు.  ఈ ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 131 మంది మృతి చెందారు.. మృతుల్లో దాదాపు 15 మంది చిన్నారులున్నారు..

ఇప్పుడు తాజాగా సౌదీ అరేబియాతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. సౌదీలోని అమెరికా ఎంబసీ ఎదుట ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కారుతో బాంబులు పేల్చారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. ఇలా వరుస సంఘటనలతో ఐసిస్ ఉగ్రవాదులు తమ ఉనికి ప్రతీ దేశంలో చాటుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *